మాస్ కా బాప్.. క్లాస్ కా బాప్ కలుస్తున్నారా?
ఒకరు మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే గాడ్ ఆఫ్ మాసెస్ అయితే? మరొకరు మట్టి వాసన కలిగిన క్లాస్ సినిమాల దర్శకుడు.;
టాలీవుడ్ లో ఓ క్రేజీ వార్త హల్ చల్ చేస్తోంది. అసలైన క్లాస్-మాస్ కలిస్తే ఎలా ఉండబోతుందో? నిరూపించడానికి ఓ ద్వయం రెడీ అవుతోందట. వివరాల్లోకి వెళ్తే..సున్నితమైన భావోద్వేగాలకు, స్వచ్ఛమైన ప్రేమకథలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు శేఖర్ కమ్ముల.. నందమూరి బాలకృష్ణతో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకరు మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే గాడ్ ఆఫ్ మాసెస్ అయితే? మరొకరు మట్టి వాసన కలిగిన క్లాస్ సినిమాల దర్శకుడు. ఈ ధృవాల కలయిక వినడానికే వింతగా ఉన్నా? ఒకవేళ ఇది నిజమైతే టాలీవుడ్‌లో ఓ సరికొత్త ప్రయోగానికి తెరలేచినట్లే.
సాధారణంగా బాలకృష్ణ సినిమా అంటే హై-వోల్టేజ్ యాక్షన్, భారీ డైలాగులు, ఊహకందని మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. మరోవైపు శేఖర్ కమ్ముల సినిమాలో సహజత్వం, నిశ్శబ్దంగా సాగే సన్నివేశాలు ప్రధానాకర్షణ. అయితే బాలకృష్ణను ఓ కొత్త కోణంలో అంటే? ఆయనలోని నటుడిని క్లాస్ టచ్‌తో చూపించేందుకు కమ్ముల ఓ బలమైన కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. `లీడర్` వంటి పొలిటికల్ థ్రిల్లర్ తీసిన అనుభవం కమ్ములకు ఉండటం తో బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా ఓ పవర్ ఫుల్ సోషల్ మెసేజ్ ఉన్న క్లాస్ కథతో ఆయనను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయట.
వీరిద్దరి కలయికపై నెటిజన్లలో అనేక సందేహాలు మొదలయ్యాయి. మాస్ కమ్ములా.. క్లాస్ బాలయ్యా? ఇది ఎలా సెట్ అవుతుంది? అని కొందరు ప్రశ్నిస్తుంటే మరికొందరు మాత్రం ఇది ఒక మాస్టర్ స్ట్రోక్ అవుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే? బాలకృష్ణ ఇటీవల అన్‌స్టాపబుల్ షో ద్వారా తనలోని సరదా కోణాన్ని , సహజత్వాన్ని ప్రేక్షకులకు దగ్గర చేశారు. శేఖర్ కమ్ముల మార్కు టేకింగ్‌లో బాలయ్య బాడీ లాంగ్వేజ్ ఓ సరికొత్త ఒరవడిని సృష్టిస్తుంది. పక్కా రియలిస్టిక్ డ్రామాలో బాలయ్య కనిపిస్తే ఆ ఇంపాక్ట్ మరో స్థాయిలో ఉంటుందని కమ్ములా అంచనా వేస్తున్నారు.
గతంలో రజనీకాంత్ వంటి స్టార్ హీరోతో పా రంజిత్ `కబాలి`, `కాలా` వంటి సినిమాలు చేసినప్పుడు ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తమయ్యాయి. స్టార్ హీరోల చుట్టూ ఉండే రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాను బ్రేక్ చేసి వారిలోని నటుడిని ఆవిష్కరించే ప్రయత్నం దర్శకుడు చేస్తే అది క్లాసిక్‌గా నిలిచిపోతుంది. శేఖర్ కమ్ముల అదే వ్యూహంతో బాలయ్య కోసం ఓ విలక్షణమైన పాత్రను డిజైన్ చేస్తున్నారని సమాచారం. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా బలమైన ఎమోషన్స్ ఉన్న కథలో బాలయ్యను చూడటం అభిమానులకు కొత్త అనుభూతినిస్తుంది.
అయితే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడం అంత సులభం కాదు. బాలయ్య ఇమేజ్‌ను కాపాడుతూనే తన మార్కు సహజత్వాన్ని వదులుకోకుండా శేఖర్ కమ్ముల కథను ఎలా మలుస్తారనేది ఆసక్తికరం. ఇద్దరి మధ్య అభిప్రాయాలు కలిస్తే టాలీవుడ్ చరిత్రలో ఇదొక అరుదైన , సాహసోపేతమైన కాంబినేషన్ అవుతుంది. ప్రస్తుతం బాలయ్య వరుసగా మాస్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ గ్యాప్‌లో కమ్ములా స్క్రిప్ట్ పనులు పూర్తైతే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. శేఖర్ కమ్ముల క్లాస్ టేకింగ్‌లో బాలయ్య మాస్ పర్ఫార్మెన్స్ తోడైతే? అది విభిన్నమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డుల కంటే? గొప్ప నటుడిని ఒక గొప్ప దర్శకుడు ఎలా ఆవిష్కరించాడనే విషయంలో సినిమా చర్చనీయాంశం అవుతుంది.