నేనే చరిత్ర.. నాదే ఆ చరిత్ర.. ఎన్బీకే పంచ్
''చరిత్రలో చాలామంది ఉంటారు. కానీ చరిత్రను తిరగరాసి మళ్లీ చరిత్ర సృష్టించే వాడు ఒక్కడే ఉంటాడు. నేనే చరిత్ర.. నాదే ఆ చరిత్ర'' అఖండ 2 ప్రీరిలీజ్ వేడుకలో నటసింహా నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలివి;
''చరిత్రలో చాలామంది ఉంటారు. కానీ చరిత్రను తిరగరాసి మళ్లీ చరిత్ర సృష్టించే వాడు ఒక్కడే ఉంటాడు. నేనే చరిత్ర.. నాదే ఆ చరిత్ర'' అఖండ 2 ప్రీరిలీజ్ వేడుకలో నటసింహా నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలివి. హైదరాబాద్ లో నిర్వహించిన `అఖండ 2` ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో బాలయ్య మాట్లాడుతూ.. నా కెరీర్‌లో ఎన్నో ప్రయోగాలు చేశా. అఖండ 2 మరో స్థాయిలో ఉంటుందని అన్నారు.
బోయపాటి శ్రీను-నేను సినిమా చేయాలనుకుంటే దానిపై మూడే నిమిషాలు మాట్లాడుకుంటాం. వెంటనే బరిలోకి దిగిపోతామని ఎన్బీకే అన్నారు. నేను పాదరసం లాంటి వాడిని.. ఏ ఛాలెంజ్‌కైనా రెడీగా ఉంటాను.. ఎప్పుడూ ఒకేలా ఉండాలని అనుకోను. కేవలం నటన కాకుండా రాజకీయాల్లో ఎమ్మెల్యేగా, బసవతారకం హాస్పిటల్ ఛైర్మన్‌గానూ కొనసాగుతున్నానని ఎన్బీకే తెలిపారు.
బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్‌గా బోయపాటి శ్రీను తెరకెక్కించిన `అఖండ 2` డిసెంబరు 5న విడుదల కానుంది. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, పూర్ణ తదితరులు ఈ చిత్రంలో నటించారు. దేశాన్ని రక్షించేందుకు సైనికులు ఉంటే.. ధర్మాన్ని కాపాడేందుకు అఘోరాలు, స్వాములు ఉన్నారు అనే కాన్సెప్టుతో హిందూ సనాతన ధర్మాన్ని కాపాడటమే ధ్యేయంగా తెరకెక్కించిన చిత్రంగాను పాపులరైంది.
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 111వ చిత్రం #NBK111 త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. `వీర సింహారెడ్డి` ఘన విజయం తర్వాత ఈ కాంబినేషన్ మరోసారి రిపీటవుతోంది.