బాలయ్య హిస్టారికల్ టచ్.. నెక్స్ట్ లెవెల్ బ్లాస్ట్..!

అందుకే అఖండ 2 తాండవం పూర్తి చేయడం ఆలస్యం గోపీచంద్ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందట.;

Update: 2025-10-06 09:51 GMT

నందమూరి బాలకృష్ణ అఖండ 2 ఈ ఇయర్ డిసెంబర్ కి రిలీజ్ ఫిక్స్ చేసుకోగా ఆ సినిమా పూర్తి కాగానే నెక్స్ట్ సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టారు. బాలయ్య 111 సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో చేస్తున్నారు. ఆల్రెడీ ఈ కాంబినేషన్ లో వీర సిం హా రెడ్డి సినిమా వచ్చింది. నందమూరి ఫ్యాన్స్ కి వీర సింహా రెడ్డి సూపర్ మాస్ ట్రీట్ ఇచ్చింది. స్వతహాగా బాలయ్య ఫ్యాన్ అయిన గోపీచంద్ ఆయన్ను డైరెక్ట్ చేసి అదరగొట్టారు. ఐతే వీర సింహారెడ్డి టైం లోనే బాలయ్యతో మరో సినిమా చేయాలని ఉందని చెప్పగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

వీర సింహా రెడ్డి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో..

అందుకే అఖండ 2 తాండవం పూర్తి చేయడం ఆలస్యం గోపీచంద్ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందట. ఐతే ఈ సినిమాను ఈ నెల 24న ముహూర్త కార్యక్రమాలు జరుపుతారని తెలుస్తుంది. వీర సింహా రెడ్డి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కించిన గోపీచంద్ ఈసారి బాలయ్యతో హిస్టారికల్ టచ్ ఉన్న కథతో వస్తున్నాడట. స్క్రిప్ట్ కూడా బాగా వచ్చిందని టాక్. ఈ సినిమాకు టెక్నికల్ టీం కూడా భారీ ప్లానింగ్ ఉందట. కాంతారా సినిమాకు పనిచేసిన కెమెరా మెన్ ఎస్. కాశ్యప్ ని బాలయ్య సినిమాకు సెలెక్ట్ చేశాడట గోపీచంద్ మలినేని.

గోపీచంద్ రీసెంట్ గా సన్నీ డియోల్ తో జాత్ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు బాలయ్యతో హిస్టారికల్ టచ్ ఉన్న కథతో మరోసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ సెట్స్ మీదకు వెళ్తుందట. నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. గోపీచంద్ మేకింగ్ మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్న బాలకృష్ణ ఈ సినిమాను ఫ్యాన్స్ కి ఒక స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా ప్లాన్ చేయాలని అనుకుంటున్నారట.

అఖండ 2 తాండవం పాన్ ఇండియా రిలీజ్..

బాలకృష్ణ అఖండ 2 తాండవం సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అఖండ సినిమా తెలుగు వెర్షన్ మాత్రమే రిలీజ్ కాగా ఆ సినిమా హిందీ డబ్బింగ్ యూట్యూబ్ లో సూపర్ హిట్ అయ్యింది. అందుకే అఖండ 2 ని నేషనల్ వైడ్ గా ఒకేసారి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

బాలయ్య గోపీచంద్ మలినేని ఈ కాంబో సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు కూడా ఉంటాయట. ఈ సినిమాతో ఫ్యాన్స్ కి తన డైరెక్షన్ లో ఒక నెవర్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ అందించేలా ఉండాలని గోపీచంద్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు బాలయ్య ఆదిత్య 999 సినిమా కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు.

Tags:    

Similar News