బాల‌య్య బ‌ర్త్ డేకి బ్లాస్టింగ్ కాంబినేష‌న్!

ఈ క్ర‌మంలోనే బాల‌య్య తో మ‌రో సినిమా ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ వివ‌రాలు గోపీచంద్ మ‌లినేని ప్ర‌క‌టించారు.;

Update: 2025-04-19 07:06 GMT

న‌ట‌సింహ బాల‌కృష్ణ - గోపీచంద్ మ‌లినేని ప్రాజెక్ట్ ముహూర్తం ఫిక్సైపోయిందా? సింహం గ్యాప్ లేకుండా బ‌రిలోకి దిగ‌బోతుందా? అంటే అవున‌నే తెలుస్తోంది. బాల‌య్య‌-గోపీచంద్ మ‌లినేని క‌ల‌యిక అంటే? ఓ సంచ‌ల‌నం. ఇప్ప‌టికే ఇద్ద‌రి కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన తొలి చిత్రం `వీర‌సింహారెడ్డి` మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. బాల‌య్య ఖాతాలో మ‌రో మాస్ హిట్ అది. బాల‌య్య స‌క్సెస్ వేగాన్ని కొన‌సాగించ‌డంలో వీర‌సింహారెడ్డి కీల‌క పాత్ర పోషించిన చిత్రంగా నిలిచింది.

ఈ క్ర‌మంలోనే బాల‌య్య తో మ‌రో సినిమా ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ వివ‌రాలు గోపీచంద్ మ‌లినేని ప్ర‌క‌టించారు. ఇది పూర్తి మాస్ యాక్ష‌న్ చిత్రంగా తెలిపారు. బాల‌కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా జూన్ 10న సినిమా ప్రారంభోత్స‌వం ఉంటుంద‌ని తెలిపారు. దీంతో `అఖండ 2` త‌ర్వాత బాల‌య్య మొద‌లు పెట్టే చిత్ర‌మిదేన‌ని తెలిపోయింది. అంటే జూన్ లోగా అఖండ 2 షూటింగ్ పూర్త‌యిపోతుంది.

ఒక‌వేళ పెండింగ్ షూటింగ్ ఉన్నా? బాల‌య్య పోర్ష‌న్ మాత్రం పూర్తి చేసేస్తారు. ఈ క్ర‌మంలోనే గోపీచంద్ ప్రారంభోత్స‌వ తేదీని అధిక‌రికంగా వెల్ల‌డించిన‌ట్లు తెలుస్తోంది. ఆదిత్య 369కి సీక్వెల్ కూడా ఉంటుంద‌ని బాల‌య్య ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కానీ గోపీచంద్ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కిస్తున్న నేప‌థ్యంలో సీక్వెల్ ఇప్ప‌ట్లో ఉండ‌ద‌ని తెలుస్తోంది. ఈ సినిమా విష‌యంలో బాల‌య్య త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నట్లు సింగీతం శ్రీనివాసరావు మాట‌ల్లోనూ క‌నిపించింది.

సీక్వెల్ క‌థ బాల‌య్య స్యయంగా సిద్దం చేసిన‌ట్లు తెలిపారు. ఇదే సినిమాతో త‌న‌యుడు మోక్ష‌జ్ఞ‌ని లాంచ్ చేయాల‌నే ప్ర‌య‌త్నాలు జ‌రిగిన‌ట్లు వార్త‌లొచ్చాయి. కానీ త‌ర్వాత మ‌ళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. తాజాగా సీక్వెల్ ప‌క్క‌కు పోయి గోపీచంద్ మ‌లినేని లైన్ లోకి రావ‌డం ఇంట్రెస్టింగ్.

Tags:    

Similar News