మోక్షు డెబ్యూ.. హీరోయిన్ కూడా ఫిక్స్ అయిందా?
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ.. టాలీవుడ్ ఎంట్రీ కోసం అటు సినీ ప్రియులు.. ఇటు అభిమానులు ఎంతో వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే.;
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ.. టాలీవుడ్ ఎంట్రీ కోసం అటు సినీ ప్రియులు.. ఇటు అభిమానులు ఎంతో వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిగో.. అదిగో అంటూ కొన్నేళ్లు గడిచిపోయాయి. ఆ తర్వాత గత ఏడాది మోక్షు బర్త్ డే నాడు.. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో డెబ్యూ మూవీ ఉంటుందని ప్రకటించారు.
కానీ ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. రద్దు కూడా అయినట్లే. దీంతో మోక్షు డెబ్యూ డైరెక్టర్ ఆయనే.. ఈయనే అంటూ ఇటీవల రకరకాల వార్తలు వచ్చాయి. రీసెంట్ గా బాలయ్య.. తన కుమారుడు ఎంట్రీ గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. ఇఫీ వేడుకల్లో.. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఆదిత్య 369కి సీక్వెల్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడని క్లారిటీ ఇచ్చారు.
ఆదిత్య 369లో నటించి సూపర్ హిట్ అందుకున్న బాలయ్య.. ఇప్పుడు ఆయన కొడుకు ఆ మూవీ సీక్వెల్ తో హీరోగా పరిచయం చేయనున్నారు. క్రిష్ జాగర్లమూడి మోక్షు డెబ్యూకు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని.. త్వరలో అధికారికంగా ప్రాజెక్టు అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారని సమాచారం.
అయితే ఇప్పుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఫిమేల్ లీడ్ ను ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాషా తడానీ.. మోక్షు సరసన నటించనుందని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో నిజమెంతో తెలియకపోయినా.. వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి.
కాగా.. సీనియర్ బ్యూటీ రవీనా టాండన్, అనిల్ తడానీ కుమార్తె అయిన రాషా ఇప్పటికే బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె చేసిన ఉయ్యమ్మ సాంగ్ ఫుల్ వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంది. మంచి క్రేజ్ కూడా తెచ్చిపెట్టింది. ఇప్పుడు బాలయ్య కుమారుడి డెబ్యూ మూవీలో హీరోయిన్ గా నటించనుందని ప్రచారం జరుగుతోంది.
అయితే ఇటీవల ఆమె టాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్టు అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. ఘట్టమనేని వారసుడు, దివంగత కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఫస్ట్ మూవీలో హీరోయిన్ రోల్ కు రాషానే సెలెక్ట్ చేశారు. రీసెంట్ గా అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు మోక్షు డెబ్యూ మేకర్స్ కూడా రివీల్ చేస్తారని తెలుస్తోంది. మరి చూడాలి అందులో ఎంతవరకు నిజముందో.