సింహాన్ని సూపర్ స్టార్ రేంజ్ లోనే!
నందమూరి బాలకృష్ణ మాస్ పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలయ్య స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లలో పూనకాలు రావాల్సిందే.;
నందమూరి బాలకృష్ణ మాస్ పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలయ్య స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లలో పూనకాలు రావాల్సిందే. అలాంటి బాలయ్యతో సోషల్ మెసేజ్ ప్లస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌ను పక్కాగా బ్యాలెన్స్ చేసే దర్శకుడు కొరటాల శివ సినిమా చేయబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేందుకు కొరటాల శివ ఓ మాస్టర్ ప్లాన్ వేశారట. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారుట. ఈ వార్త నిజమైతే
ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ముందే సంచలనమవ్వడం ఖాయం.
ప్రస్తుతం ఇండియన్ సినిమాలో అనిరుధ్ ఒక బ్రాండ్. పాటలతోనే కాకుండా నేపథ్య సంగీతం తో సినిమా రేంజ్‌ను మార్చగల సత్తా అతడి సొంతం. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను `జైలర్` సినిమాతో అనిరుధ్ ఏ స్థాయిలో ఎలివేట్ చేశాడో తెలిసిందే. రజనీకాంత్ నడకకు, ఆయన మ్యానరిజమ్స్‌కు అనిరుధ్ ఇచ్చిన బీజీఎమ్ థియేటర్లను ఊగిపోయేలా చేసింది. ఇప్పుడు అలాంటి మ్యాజిక్‌ను బాలయ్య సినిమా కోసం అనిరుధ్ రిపీట్ చేయబోతున్నారనే వార్త నందమూరి అభిమానుల్లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. బాలకృష్ణ సినిమాల్లో యాక్షన్ ఎంత ముఖ్యమో? దానికి తోడయ్యే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అంతే కీలకం.
గతంలో `అఖండ` సినిమాకు థమన్ ఇచ్చిన సంగీతం సినిమా విజయంలో ఎంతటి పాత్ర పోషించిందో తెలిసిందే. తాజాగా కొరటాల శివ సినిమాలో బాలయ్యను మరింత కొత్తగా, పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నారు. ఇలాంటి తరుణంలో అనిరుధ్ వంటి గ్లోబల్ మ్యూజిక్ డైరెక్టర్ రంగంలోకి దిగితే బాలయ్య మార్క్ డైలాగులు , యాక్షన్ సీక్వెన్స్‌లకు అదనపు బలం చేకూరుతుంది. అనిరుధ్ ఇచ్చే ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ బాలయ్య మాస్ ఇమేజ్‌ను పాన్-ఇండియా లెవల్‌లో మారుమోగేలా చేస్తుంది. కొరటాల శివ సినిమాల్లో సంగీతానికి, ఆర్ఆర్ కు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఆయన ఎంతో తెలివిగా అనిరుధ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అనిరుద్ తెలుగులో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఆయన శైలి మాస్ సినిమాలకు కొత్త ఊపునిస్తుంది. బాలయ్య సింహ గర్జన లాంటి నటనకు, అనిరుధ్ రాక్ స్టార్ మ్యూజిక్ తోడైతే అది సినిమాగానే గాక సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌లా ఉంటుంది . ఈ కాంబినేషన్ కుదిరితే బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మ్యూజికల్ మాస్ ఎంటర్టైనర్ అవుతుంది. మ్యూజిక్ పరంగానే కాకుండా బిజినెస్ పరంగా కూడా సినిమాకు పెద్ద అసెట్ అవుతుంది. కోలీవుడ్‌లో అనిరుధ్ సినిమాలకు ఉన్న క్రేజ్ ఈ సినిమాపై అక్కడ కూడా భారీ అంచనాలకు తావిచ్చినట్లే. రజనీకాంత్, విజయ్, అజిత్ వంటి స్టార్లకు సెకెండ్ ఇన్నింగ్స్ లో ఓ రేంజ్ ఇచ్చాడు అనిరుద్. బాలయ్య విషయంలో అదెక్కడా తగ్గదు. వాళ్లను మించే ఉంటుంది తప్ప తగ్గడానికి ఛాన్సేలేదు.