అఖండ 2 : మొదటి పాటతోనే పిచ్చెక్కించే ప్లాన్
నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'అఖండ 2'.;
నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'అఖండ 2'. ఇప్పటికే వచ్చిన అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, సనాతన ధర్మ గురించి చెప్పడంతో హిందువులు మరింత ఆసక్తిగా అఖండ 2 కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కోసం ఆ మధ్య జరిగిన మహాకుంభమేళలో కొన్ని విజువల్స్ చిత్రీకరించడంతో పాటు, అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించారు. ముఖ్యంగా హిమాలయాల్లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చేసినట్లు మేకర్స్ ద్వారా తెలుస్తోంది. సాధారణంగా బాలకృష్ణ చాలా స్పీడ్‌గా సినిమాలు చేస్తూ పోతాడు. కానీ ఈ సినిమా విషయంలో ఆయన చాలా స్లోగా ఉన్నాడు. అంతే కాకుండా బోయపాటి శ్రీను అడిగినంత సమయంను బాలకృష్ణ ఈ సినిమా కోసం ఇవ్వడంతో బెస్ట్ ఔట్ పుట్ వచ్చిందని మేకర్స్ అంటున్నారు.
అఖండ 2 సినిమా కోసం...
ఇప్పటికే సినిమాను డిసెంబర్ 5న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. అఖండ 2 సినిమా విడుదలకు నెల కూడా సమయం లేదు. అయినా ఇప్పటి వరకు మ్యూజిక్ వినిపించడం లేదు, అసలు ఇప్పటి వరకు తమన్ నుంచి ఎలాంటి సౌండ్ లేదు ఏంటి అంటూ అభిమానులు ఆందోళనతో ఎదురు చూస్తున్న సమయంలో వచ్చింది మొదటి పాట ప్రకటన. ఎట్టకేలకు అఖండ 2 నుంచి మొదటి పాట రాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఆ ఆనందం రెట్టింపు అయ్యే విధంగా ఆ పాటను శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ వంటి గొప్ప మాస్ డెవోషనల్ సింగర్స్ పాడబోతున్నట్లుగా తమన్ ప్రకటించిన నేపథ్యంలో పాటపై అంచనాలు మరింతగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ పాట ఉంటుంది అనే నమ్మకంను తమన్‌తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
తమన్ విడుదల చేయనున్న మొదటి పాట
అఖండ సినిమాకి ప్రధాన ఆకర్షణగా మ్యూజిక్ నిలిచిందని ఇప్పటికీ అంటూ ఉంటారు. బాలకృష్ణ గత కొంత కాలంగా తన ప్రతి సినిమాకు తమన్‌తో సంగీతాన్ని ఇప్పిస్తున్నాడు. ఇద్దరి మధ్య అనుబంధం మరింతగా పెరుగుతూ వచ్చింది. బాలకృష్ణ తనను చాలా ఆప్యాయంగా చూసుకుంటాడని తమన్ అంటూ ఉంటాడు. అలాంటి బాలకృష్ణ కోసం తన బెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా దూరం నుంచి సింగర్స్ ను, ఎక్కడెక్కడో ఉన్న వారిని తీసుకు వచ్చి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇప్పించడం జరిగింది. అలాంటి తమన్ ఈ పాటను శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ వంటి వారితో పాడిస్తున్న నేపథ్యంలో సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అఖండ 2 ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉంది అనుకుంటే, మొదటి పాటతోనే ఫ్యాన్స్‌కి మాత్రమే కాకుండా అందరికీ తమన్ పిచ్చెక్కి పోయి, సినిమా కోసం వెయిట్ చేసే పరిస్థితి తీసుకు వచ్చేలా ఉన్నాడు.
బోయపాటి, బాలకృష్ణ కాంబో అఖండ 2 రిలీజ్..
సినిమా మరో నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందుకే ప్రమోషన్ బాధ్యత మొత్తం తమన్ తన భుజాల మీద వేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తన పూర్తి దృష్టి అఖండ 2 పైనా తమన్ పెట్టాడట. పాటల బ్యాలన్స్ వర్క్‌తో పాటు బీజీఎం విషయంలో తమన్ దేశం మొత్తం నుంచి టెక్నీషియన్స్ ను తెప్పిస్తున్నాడు. సరికొత్త మిక్సింగ్ టెక్నిక్స్ ను వినియోగిస్తున్నాడు. దాంతో ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెవ్వర్ బిఫోర్ అన్నట్లుగా ఉంటుంది అనే విశ్వాసంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలకృష్ణ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. బోయపాటి ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందించాడు. తనపై ఉన్న విమర్శలకు అఖండ 2 తో సమాధానం ఇవ్వడానికి బోయపాటి చాలా సీరియస్‌గా ఉన్నాడని తెలుస్తోంది.