మ‌రో రెండ్రోజుల్లో ఫినిష్ చేయ‌నున్న బాల‌య్య‌

బాల‌య్య‌- బోయ‌పాటి కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న సినిమా అవ‌డం పైగా, బ్లాక్ బ‌స్ట‌ర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా వ‌స్తుండ‌టంతో అఖండ‌2పై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి.;

Update: 2025-08-06 09:30 GMT

వ‌రుస హిట్ల‌తో నంద‌మూరి బాల‌కృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నారు. స‌క్సెస్ ఇచ్చిన ఆనందంతో వ‌రుస పెట్టి సినిమాలు చేస్తోన్న బాల‌య్య ఈ ఏడాది ఇప్ప‌టికే డాకు మ‌హారాజ్ సినిమాతో మంచి హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. ప్ర‌స్తుతం బాల‌య్య అఖండ‌2: తాండ‌వం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బోయ‌పాటి శ్రీను ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

సెకండ్ హ్యాట్రిక్ కోసం ప్ర‌య‌త్నాలు

బాల‌య్య‌- బోయ‌పాటి కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న సినిమా అవ‌డం పైగా, బ్లాక్ బ‌స్ట‌ర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా వ‌స్తుండ‌టంతో అఖండ‌2పై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే బాల‌య్య‌- బోయ‌పాటి క‌ల‌యిక‌లో మూడు సినిమాలు రాగా ఆ మూడు సినిమాలూ భారీ హిట్లుగా నిలిచి ఇద్ద‌రి కెరీర్ల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ్డాయి. ఇప్పుడు వీరిద్ద‌రూ క‌లిసి అఖండ‌2తో సెకండ్ హ్యాట్రిక్ ను మొద‌లుపెట్టాల‌ని చూస్తున్నారు.

డ‌బ్బింగ్ ద‌శ‌లో అఖండ‌2

భారీ అంచ‌నాల‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఆఖ‌రి ద‌శ‌లో ఉంది. ఇప్ప‌టికే బాల‌య్య ఫ‌స్ట్ హాఫ్ కు త‌న డబ్బింగ్ ను కూడా పూర్తి చేశార‌ని, మ‌రో రెండ్రోజుల్లో సెకండాఫ్ డ‌బ్బింగ్ ను కూడా పూర్తి చేస్తార‌ని తెలుస్తోంది. డ‌బ్బింగ్ కోసం బోయ‌పాటి ఇత‌ర నటీన‌టుల డేట్స్ ను కూడా తీసుకుని ఆగ‌స్ట్ మూడో వారం నాటికి మొత్తం డ‌బ్బింగ్ ను పూర్తి చేయాల‌ని చూస్తున్నార‌ట‌.

సెప్టెంబ‌ర్ 25న రిలీజ్ అఖండ‌2 సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న నేప‌థ్యంలో వీలైనంత త్వ‌ర‌గా సినిమా ఫ‌స్ట్ కాపీని రెడీ చేసి ప్ర‌మోష‌న్స్ ను వేగవంతం చేయాల‌ని బోయ‌పాటి చూస్తున్నార‌ట. ప్ర‌గ్యా జైశ్వాల్, సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి విల‌న్ గా న‌టిస్తున్నారు. త‌మ‌న్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News