65 ఏళ్ల కెరియర్ లో బాలయ్య సాహసం.. తమన్ మాటల్లో!
అంటే బాలకృష్ణ డెడికేషన్ కి ఆయన ఫిదా అయిపోయారు అన్నమాట.. ఆ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ.. "బాలకృష్ణ యాక్టింగ్ ని నేను లైన్లో చూసినప్పుడు చాలా భయపడిపోయాను.;
నందమూరి బాలకృష్ణ సినిమా కోసం చాలా డెడికేషన్ తో పనిచేస్తారు. ఆయన సినిమా కోసం ఎంత శ్రమిస్తారు అంటే లైవ్ లో చూసేవారికి గూస్ బంప్స్ రావడంతో పాటు కొన్ని కొన్ని కష్టమైన సీన్స్ చూస్తే కన్నీళ్లు కూడా వస్తాయట. అయితే ఇలాంటి ఒక సంఘటన గురించే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. 65 ఏళ్ల వయసులో బాలకృష్ణ కష్టం చూసి కన్నీళ్లు పెట్టుకున్నారట. మరి ఇంతకీ తమన్ ని ఏడిపించేసిన బాలకృష్ణ కష్టం ఏంటి..? ఎందుకు తమన్ అంతలా రియాక్ట్ అవుతున్నారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
బాలయ్య పర్ఫామెన్స్ పై తమన్ కామెంట్స్..
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న అఖండ 2: తాండవం సినిమాలో నటిస్తున్నారు. అయితే అఖండ సీక్వెల్ లో బాలకృష్ణ పూర్తిగా అఘోర గెటప్ లోనే కనిపించబోతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు దేశాలలో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా వేగంగా జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా జార్జియాలో జరిగిన షూటింగ్ గురించి తమన్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అఖండ 2 టీజర్ చూస్తే మంచి వైబ్ ఉంది. లైవ్ లో చూసినప్పుడు ఆయన యాక్టింగ్ మీకెలా అనిపించిందని తమన్ ని ప్రశ్నించగా.. తమన్ ఎమోషనల్ గా ఓ దండం పెట్టేసారు.
65 ఏళ్ల వయసులో బాలయ్య ఇంత కష్టపడ్డారా?
అంటే బాలకృష్ణ డెడికేషన్ కి ఆయన ఫిదా అయిపోయారు అన్నమాట.. ఆ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ.. "బాలకృష్ణ యాక్టింగ్ ని నేను లైన్లో చూసినప్పుడు చాలా భయపడిపోయాను. ఎందుకంటే జార్జియాలో మైనస్ 14° ఉన్న మంచులో షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో మేమందరం ఒంటినిండా బట్టలు, స్వెటర్స్ వేసుకొని మొహానికి మంకీ క్యాప్ పెట్టుకున్నాం. కానీ బాలయ్య గారు మాత్రం ఒక రెడ్ కలర్ క్లాత్ ని ఒంటి మీద కప్పుకొని ఓపెన్ చెప్పులతోనే ఆ మంచులో నడిచారు.
బాలయ్య పర్ఫామెన్స్ కి తమన్ కన్నీళ్లు..
అయితే ఆ మంచులో షూ లేకుండా నడవలేం. ఎందుకంటే మంచు కొరికేస్తుంది.కానీ ఎముకలు గడ్డకట్టే చలిలో కూడా బాలయ్య నాలుగైదు కిలోల త్రిశూలాన్ని చేతిలో పట్టుకొని అలా డైలాగులు చెబుతూ నడుచుకుంటూ వచ్చారు.ఆ సమయంలో ఆయన యాక్టింగ్, డైలాగులను చూసి నేను కన్నీళ్లు పెట్టుకున్నాను.. నన్ను చూసిన బాలయ్య గారు వెంటనే వచ్చి నా కన్నీళ్లు తుడిచారు.మనం ఏసీ రూమ్ లలో కూర్చొని సినిమా చూస్తూ ఉంటాం. కానీ ఆయన పడిన కష్టానికి ప్రతిఫలంగా ఏం చేయాలో నేను నా వర్క్ తో చూపిస్తా.నేనేంటో కూడా చూపిస్తా" అంటూ తమన్ ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు. అలా బాలకృష్ణ పడిన కష్టానికి తన మ్యూజిక్ తో సినిమా మరింత అద్భుతంగా వచ్చేలా కష్టపడతానని తమన్ చెప్పుకొచ్చారు.. తమన్ మాటలతోనే బాలకృష్ణ అఖండ 2: తాండవం సినిమా కోసం ఎంత శ్రమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
అఖండ 2: తాండవం సినిమాలు..
అఖండ 2: తాండవం సినిమా విషయానికి వస్తే.. బోయపాటి శ్రీను డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. అఖండ 2 సినిమా తర్వాత బాలకృష్ణ వీర సింహారెడ్డి కాంబో రిపీట్ చేయబోతున్నారు. మరోసారి గోపీచంద్ మలినేనితో కలిసి వర్క్ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. అలాగే కొరటాలశివ దేవర -2 తర్వాత 2027లో బాలకృష్ణతో కలిసి ఓ సినిమా చేస్తారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.