'అఖండ' కి ప్రీక్వెల్ నెవెర్ బిఫోర్!
నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తోన్న `అఖండ2` ఆన్ సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే.;
నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తోన్న `అఖండ2` ఆన్ సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. అన్ని పనులు పూర్తి చేసి సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తు న్నారు. చెప్పిన టైమ్ కి సినిమా రిలీజ్ చేయడం అన్నది బాలయ్య స్టైల్. అందుకే రిలీజ్ తేదీని కూడా మరోసారి కన్పమ్ చేసారు. ఆ తేదీకి తగ్గట్టు షూటింగ్ పూర్తి చేసుకుంటూ..మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది.` అఖండ2` అన్నది అఖండ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అఖండ 2 కంటున్యూటీగా ఉండబోతుంది. అయితే ఇదే సినిమాలో ప్రీక్వెల్ కి లీడ్స్ కూడా ఇవ్వబోతున్నారుట. బోయపాటి కథను రెడీ చేసిన సమయంలో ప్రీక్వెల్స్ లీడ్స్ సిద్దం చేసారుట. అఖండ 2 లో చాలా చోట్ల ఆలీడ్స్ ఉంటాయని అంటున్నారు.
ప్రీక్వెల్ అంటే? అఖండ ముందు జరిగిన కథను చెప్పాలి. ఆ కథకు సంబంధించిన లీడ్స్ రెండవ భాగంలో ఉంటాయి. అఖండలో బాలయ్య హైలైట్ అయిన రోల్ ఏది అంటే? అఘోర పాత్ర అన్నది అందిరికీ తెలసు. దీంతో ప్రీక్వెల్ లో బాలయ్య రోల్ ఎలా ఉంటుంది? అన్నది సస్పెన్స్ మారింది.
అఘోర కాన్సెప్ట్ తో వస్తాడా? లేక రుషి కాన్సెప్ట్ తీసుకుంటున్నాడా? అన్నది తెరపైకి వస్తోన్న అంశం. దీనికి సంబంధించి క్లారిటీ రావాలంటే `అఖండ 2` రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికే బాలయ్య అఘోర గెటప్ లో అదరగొడుతున్నాడు. అఘోర పాత్రలు పోషిస్తే బాలయ్య మాత్రమే పోషిం చాలి అన్న రేంజ్ లో హైలైట్ అవుతుంది. అదే మరి నటసింహం ప్రత్యేకత