అఖండ2 అక్కడ సక్సెస్ అయ్యేలానే ఉందే!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో రూపొందిన తాజా సినిమా అఖండ2 తాండవం.;
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో రూపొందిన తాజా సినిమా అఖండ2 తాండవం. గతేడాది డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ2 భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్డ్స్ రెస్పాన్స్ వచ్చింది. అఖండతో పోల్చి చూడటం వల్ల ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.
భారీ రేటుకు అఖండ2 డిజిటల్ రైట్స్
కానీ అఖండ2లో బాలయ్య మార్క్ యాక్షన్, డైలాగులు ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించాయి. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ తో పాటూ బి, సి సెంటర్లలో కూడా బాగానే కలెక్షన్లు వచ్చాయి. అయితే ఇప్పుడీ మూవీ ఓటీటీలో అలరించడానికి రెడీ అయింది. అఖండ2 తాండవం డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
నెట్‌ఫ్లిక్స్ లో 5 భాషల్లో స్ట్రీమింగ్
సంక్రాంతి సినిమాలు వస్తుండటంతో అఖండ2 సందడి బాక్సాఫీస్ వద్ద పూర్తైపోయింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడీ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు. అయితే అఖండ2 డిజిటల్ స్ట్రీమింగ్ కోసం చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ ఎదురుచూపులకు తెర దించుతూ జనవరి 9 నుంచి అఖండ2ను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు.
ఆల్రెడీ ఓటీటీలోకి వచ్చిన అఖండ2కు మంచి రెస్పాన్సే వస్తోంది. థియేటర్లలో ఈ మూవీని మిస్ అయిన ఆడియన్స్ ఇప్పుడు దాన్ని నెట్‌ఫ్లిక్స్ లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. పండగ సీజన్ స్టార్ట్ అవడంతో, ఇంట్లో కూర్చుని ఎంతోమంది ఫ్యామిలీతో అఖండ2 ను చూస్తూ సినిమాలోని బాలయ్య నటన, యాక్షన్ సీన్స్ గురించి చర్చించుకుంటున్నారు. సింహా, లెజెండ్, అఖండ లాంటి సినిమా సక్సెస్‌ఫుల్ తర్వాత బాలయ్య- బోయపాటి కాంబోలో వచ్చిన ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందనుకుంటే అఖండ2 ఈసారి ఆ మ్యాజిక్ చేయలేకపోయింది. మరి బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయిన అఖండ2 ఓటీటీలో సక్సెస్ అవుతుందేమో చూడాలి.