బాలయ్య 111లో కేరళ కుట్టీ?
నటసింహ బాలకృష్ణ 111వ చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలోప్రారంభమైన సంగతి తెలిసిందే.;
నటసింహ బాలకృష్ణ 111వ చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలోప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులోనూ బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుంది. ఇందులో బాలయ్య కు హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకున్నారు. బాలయ్య తో నయన్ నటించడం నాల్గవసారి. మెయిన్ లీడ్ కి నయన్ హీరోయిన్గా కనిపించనుంది. మరి సెకెండ్ లీడ్ సంగతేంటి? అంటే ఆపాత్ర కోసం కేరళ కుట్టి ఆషీకా రంగనాధ్ ని దించే ప్రయత్నాల్లో ఉన్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది.
ప్రతిభావంతురాలే కానీ:
మేకర్స్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారుట. ఆషీకా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. `అమిగోస్` తో తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు అటుపై నాగార్జున హీరోగా నటించిన `నా సామిరంగ`లో నటించింది. ఈ సినిమా విజయం సాధించడంతో మంచి గుర్తింపు దక్కింది. అందం, అభినయం గల నాయిక కావడంతో స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా భావించారు. కానీ అనుకున్న విధంగా కెరీర్ సాగలేదు. `నా సామీరంగ` తర్వాత మరో తెలుగు సినిమా సైన్ చేయడానికి రెండేళ్లు సమయం పట్టింది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తోన్న `విశ్వంభర` లో నటిస్తోంది.
సీనియర్లలో ఆయనొక్కడే బ్యాలెన్స్
అదీ హీరోయిన్ పాత్ర కాదు. సినిమాలో ఓ కీలకమైన పాత్ర మాత్రమే. అయినా అది సైడ్ క్యారెక్టర్ గానే భావించాలి. ఈ నేపథ్యంలో బాలయ్య సినిమాలో ఛాన్స్ ను అషీకా రంగనాద్ ఎంత మాత్రం మిస్ చేసుకునే అవకాశం లేదు. అమ్మడి వయసు కూడా మూడు పదులకు చేరుకుంది. దీంతో వయసు పరంగా సీనియర్లకు అడ్డంకిగా మారదు. సీనియర్ స్టార్లకు సరితూగుతుంది. బాలయ్య సినిమాలో ఛాన్స్ ఒకే అయితే? సీనియర్ హీరోల్లో పెండింగ్ లో ఉండేది విక్టరీ వెంకటేష్ మాత్రమే. ఆయనతోనూ ఓ సినిమా చేస్తే? సీనియర్లను పూర్తి చేసినట్లే.
సొంత పరిశ్రమకు దూరం కాకుండా:
ప్రస్తుతం తమిళ్ లో కార్తీ కి జోడీగా స్పై థ్రిల్లర్ `సర్దార్ 2`లో నటిస్తోంది. మిత్రన్ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. `విశ్వంభర` కూడా సమ్మర్ రిలీజ్ రేసులో కనిపిస్తుంది. అదే జరిగితే వరుస రిలీజ్ లతో ప్రేక్షకుల మధ్యలో ఉన్నట్లే. బాలయ్య సినిమా కూడా దసరా కు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఆషీకా సొంత పరిశ్రమ శాండిల్ వుడ్ కు దూరం కాలేదు. వచ్చిన అవకాశాలను అక్కడా సద్వినియోగం చేసుకుంటుంది. ఆమె నటించిన `గత వైభవ` అనే చిత్రం నవంబర్ లోనే రిలీజ్ అయింది.