ఫుల్ మ్యాసీగా నాగ శౌర్య.. బ్యాడ్ బాయ్ టీజర్ చూశారా?
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య గురించి తెలిసిందే. తన లుక్స్ తో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.;
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య గురించి తెలిసిందే. తన లుక్స్ తో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. 14 ఏళ్ల క్రితం కెరీర్ స్టార్ట్ చేసిన నాగశౌర్య.. ఛలో మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ చిత్రంతో అదిరిపోయే హిట్ సాధించి.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
కానీ అనుకున్న స్థాయిలో హిట్స్ దక్కకపోవడంతో కాస్త సైలెంట్ అయ్యారు. చివరగా రెండేళ్ల క్రితం రంగబలితో థియేటర్స్ లోకి రాగా.. ఆ సినిమా కూడా యావరేజ్ గా నిలిచింది. ఇప్పుడు బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సరైన కమ్ బ్యాక్ అందుకుని సత్తా చాటాలని చూస్తున్నారు.
యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమాకు రామ్ దేశిన దర్శకత్వం వహిస్తున్నారు. బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీతోనే ఆయన డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నారు. విధి హీరోయిన్ గా నటిస్తుండగా, బ్యాడ్ బాయ్ కార్తీక్ ప్రాజెక్టును నాగశౌర్య ఎప్పుడో ప్రకటించారు. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఆ తర్వాత సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. గ్లింప్స్ లో స్టార్టింగ్ లో క్లాసీ, మాసీగా రెండు లుక్స్ లో నాగశౌర్యను పరిచయం చేశారు. ఆ తర్వాత మౌనంగా ఉండే సమయం ఓవర్ అంటూ విలన్స్ పై దండయాత్రకు సిద్ధమై చితక్కొడతారు. చివరగా వెన్నెల కిషోర్ ఫన్నీ డైలాగ్ తో టీజర్ ఎండ్ అయింది.
అయితే యూత్ ఫుల్, యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నట్లు టీజర్ బట్టి క్లియర్ గా తెలుస్తోంది. కెరీర్ లోనే ఫుల్ మాస్ లుక్ లో నాగశౌర్య కనిపిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో నిండిన గ్లింప్స్.. సినిమాలో నాగశౌర్య డైనమిక్ పర్సనాలిటీ హైలైట్ చేస్తోంది. ఆయన చెప్పిన డైలాగ్స్ మాత్రం రోటీన్ గా అనిపిస్తున్నాయి.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం పెర్ఫెక్ట్ గా ఉన్నట్లు అనిపిస్తోంది. ఓవరాల్ గా మూవీ పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండనున్నట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది. అయితే సినిమాలో హీరో ప్రేయసిగా విధి నటిస్తుండగా, వెన్నెల కిషోర్ హాస్యభరితమైన పాత్ర పోషిస్తున్నారు. సాయి కుమార్ పోలీస్ పాత్రలో కనిపించగా.. సముద్రఖని, నరేష్, పూర్ణ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. హారిస్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్న సినిమాను శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ నిర్మిస్తోంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.