బెల్లంకొండ సరికొత్త సక్సెస్ ఫార్ములా!
ఓ పక్క `టైసన్ నాయుడు`ని పూర్తి చేస్తూనే మరో పక్క డివోషనల్ టచ్ ఉన్న 'హైందవ', రామమ్ ది రైజ్ ఆఫ్ అకీరా సినిమాలకు శ్రీకారం చుట్టాడు.;
పాన్ ఇండియా సినిమాల ప్రభావం, ఓటీటీల క్రేజ్ మొదలైన తరువాత కంటెంట్‌పై ప్రేక్షకులతో పాటు హీరోలు కూడా ప్రత్యేక శ్రద్ధపెడుతున్నారు. మారిన ప్రేక్షకుల మైండ్ సెట్‌కు తగ్గట్టుగా సినిమాలు చేస్తేనే సక్సెస్ కాగలమని బలంగా నమ్ముతూ సరికొత్త ఫార్ములాతో సినిమాలు చేస్తున్నారు. ఈ విషయంలో కొంత మంది పాన్ ఇండియా స్థాయి సక్సెస్‌లు సొంతం చేసుకుంటుంటే మరి కొంత మంది మినిమమ్ గ్యారంటీ హిట్‌లని దక్కించుకుంటున్నారు.
ఇప్పుడు ఇదే ఫార్ములాని యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫాలో అవుతున్నాడని తెలుస్తోంది. కెరీర్ ప్రారంభంలో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్న హీరో బెల్లం కొడ శ్రీనివాస్. `అల్లుడు శీను`తో హీరోగా భారీ మూవీతో అరంగేట్రం చేసి మంచి ఈజ్, స్పీడున్న హీరోగా పేరు తెచ్చుకున్నా ఆ తరువాత ఆ స్పీడుని కంటిన్యూ చేయలేకపోయాడు. వరుస ఫ్లాఫులతో హీరోగా రేసులో వెనకబడ్డాడు. మధ్యలో తమిళ రీమేక్ 'రాక్షసుడు'తో సక్సెస్ ట్రాక్ ఎక్కినా అల్లుడు అదుర్స్, ఛత్రపతి హిందీ రీమేక్‌లతో చేతులు కాల్చుకున్నాడు.
ఈ రెండు సినిమాల్లో అతి నమ్మకంతో చేసిన 'ఛత్రపతి' హిందీ రీమేక్ భారీ డిజాస్టర్‌గా నిలిచి కెరీర్‌ని ప్రశ్నార్థకంలో పడేసింది. దీంతో ఫార్ములా మార్చినన బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త తరహా కథలని ఎంచుకోవడం మొదలు పెట్టాడు. కథలో బలమైన ఎమోషన్, దాన్ని మరింత బలంగా ఎలివేట్ చేసే డివోషనల్ టచ్ ఉండేలా తన సినిమాలని ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అలా ఫార్ములా మార్చి చేసిన మూవీ'భైరవం'. నారా రోహిత్, మంచు మనోజ్ కీలక పాత్రల్లో నటించగా బెల్లంకొండ సురేష్ హీరోగా నటించాడు.
ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా తనకు ఊరటనిచ్చే విజయాన్ని అందించి తనని మళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చింది. ఈ మూవీ ఇచ్చిన ధైర్యంతో బెల్లంకొండ శ్రీనివాస్ వరుసగా నాలుగు క్రేజీ మూవీస్‌ని లైన్‌లో పెట్టాడు. ఓ పక్క `టైసన్ నాయుడు`ని పూర్తి చేస్తూనే మరో పక్క డివోషనల్ టచ్ ఉన్న 'హైందవ', రామమ్ ది రైజ్ ఆఫ్ అకీరా సినిమాలకు శ్రీకారం చుట్టాడు. బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్స్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి.
ఇందులో లుధీర్ బైరెడ్డి రూపొందిస్తున్న'హైదవ' ఫస్ట్ లుక్, లోకమాన్య తెరకెక్కిస్తున్న 'రామమ్' ఫస్ట్‌లుక్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ రెండు సినిమాలకు డివోషనల్ టచ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన 'హైందవ' ఆ విషయంలో ఫుల్‌క్లారిటీ ఇచ్చేసింది. ఇక రామమ్ టైటిల్ డిజైన్, దానికున్న ట్యాగ్ లైన్ సినిమా ఎలా ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేసింది. సక్సెస్ కోసం సరికొత్త ఫార్ములాని ఎంచుకుని విజయాల బాటపడుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రానున్న సినిమాలో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లని తన ఖాతాలో వేసుకోవడం లాంఛనమే.