• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అల్లరి నరేష్ 'బచ్చల...

అల్లరి నరేష్ 'బచ్చల మల్లి'.. నెవ్వర్ బిఫోర్!

| సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది.

By - Tupaki Desk
Update: 2024-06-30 06:12 GMT

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్.. వరుస సినిమాలతో ఆడియన్స్ ను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీతో వచ్చిన ఆయన.. యావరేజ్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఇంటెన్స్ మూవీ 'బచ్చల మల్లి'తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పేరు మల్లి, ఊరు బచ్చలి, పని ట్రాక్టర్ డ్రైవర్ అంటూ హీరో క్యారెక్టర్ ను రివీల్ చేశారు. ఇప్పుడు అదే జోష్ తో అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తామని నిన్న అనౌన్స్ చేశారు. చెప్పినట్లే బర్త్ డే గ్లింప్స్ ను విడుదల చేసి స్పెషల్ విషెస్ తెలిపారు మేకర్స్. ప్రస్తుతం ఆ గ్లింప్స్ నెట్టింట మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

అచ్చ పల్లెటూరిలో హీరో ఇంటి దగ్గర లౌడ్ స్పీకర్ లో భగవద్గీత ప్లే చేయడంతో గ్లింప్స్ ప్రారంభం అవుతుంది. అది తన నిద్రకు భంగం కలిగిస్తుందని కోపంగా స్పీకర్ తీసి పడేస్తాడు. ఆ తర్వాత ఊర్లో ఉన్న వైన్ షాపునకు వెళ్లి తన స్టైల్ లో గ్లాసులో మద్యం పోసుకుని తాగుతాడు. అనంతరం గూండాలతో పోరాడుతాడు. ఆ సమయంలో 'ఎవడి కోసం తగ్గాలి ఎందుకు తగ్గాలి' అంటూ డైలాగ్ చెప్పి గ్లింప్స్ చివర్లో నరేష్ అదరగొట్టేశారు.

అయితే ఈ సినిమా కోసం అల్లరి నరేష్ ఓ రేంజ్ లో మేకోవర్ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఎన్నడూ చూడని అవతార్ లో సుబ్బు.. హీరోను ప్రెజెంట్ చేస్తున్నారు. అల్లరి స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవెల్ లో ఉంది. గ్లింప్స్ లో డైలాగ్ ఒకటే ఉన్నా హైలెట్ గా నిలుస్తోంది. ఓవరాల్ గా గ్లింప్స్ లో అల్లరి నరేష్ తన పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌ తో మెప్పించారు. సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా, రోహిణి, రావు రమేష్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

హాస్య మూవీస్ బ్యానర్‌ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా బచ్చల మల్లిని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు సుబ్బునే అందిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్‌ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Full View
Tags:    
  • Tollywood 
  • FilmIndustry 
  • BachhalaMalli 
  • Glimpse 
  • AllariNaresh 
  • BirthdayWishes 
  • AllariNareshBirthdayGlimpse 
  • AmrithaAiyer 
  • SubbuMangadevvi 
  • VishalChandrashekar 
  • RazeshDanda 
  • HasyaMovies 

Similar News

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

Copyright @2026

Powered by Blink CMS