హార్డ్‌వేర్ ఫైన్.. సాఫ్ట్‌వేర్ ఫాల్ట్.. బాబా రాందేవ్ వ్యాఖ్యలు
నిజానికి సాధారణ మానవ జీవితకాలం కేవలం 100 ఏళ్లు కాదు.. 150-200 సంవత్సరాల మధ్య ఉండాలని ఆయన పేర్కొన్నారు.;
``హార్డ్‌వేర్ బాగానే ఉంది.. సాఫ్ట్‌వేర్ తప్పుగా ఉంది. లక్షణాలు బాగానే ఉన్నా.. వ్యవస్థ తప్పుగా ఉంది`` అని వ్యాఖ్యానించారు యోగా గురూ బాబా రామ్ దేవ్. బయటకు కనిపించేది వేరు.. అంతర్గతంగా ఉండేది వేరు.. ఈ రెండూ వేర్వేరు.. అని అన్నారు బాబా.
అయితే అతడి వ్యాఖ్యలు ఇటీవల ఆకస్మికంగా మృతి చెందిన కాంటాలాగా గర్ల్ షెఫాలి జరివాలా గురించి.. నేటి యువతరం ఆలోచనల గురించి.. అధునాతన జీవన శైలిలో బందీలు అయినవారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి... షెఫాలి వైద్యుల సూచనలు లేకుండా, యాంటి ఏజింగ్ మెడిసిన్ స్వీకరించడం, ఉపవాస సమయంలో ఇంజెక్షన్ తీసుకోవడం వంటి చర్యలను రామ్ దేవ్ పరోక్షంగా సూచించారు. ఇలా చేయడం ఎందుకు తప్పు? అన్నది ఆయన తనదైన శైలిలో వివరించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యత గురించి, ఆయుర్దాయం పెంచడంలో వాటి పాత్ర గురించి కూడా ఆయన మాట్లాడారు.
నిజానికి సాధారణ మానవ జీవితకాలం కేవలం 100 ఏళ్లు కాదు.. 150-200 సంవత్సరాల మధ్య ఉండాలని ఆయన పేర్కొన్నారు. అయితే మోడ్రన్ డేలో ప్రజలు తమ మెదడు, గుండె, కళ్ళు, కాలేయంపై అధిక భారం పెంచుతున్నారని ఆయన పేర్కొన్నారు. 100 సంవత్సరాలకు పైగా తినాల్సిన ఆహారం ఇప్పుడు కేవలం 25 సంవత్సరాలలోనే తినేస్తున్నారని మారిన జీవనశైలిని తప్పు పట్టారు. ఆపరేట్ చేయడం తెలిస్తే, వ్యవస్థను సరిగా చూసుకుంటే వందేళ్లు సునాయాసంగా జీవించగలరని అన్నారు.
షెఫాలి ఎంతో ఫిట్ గా బయటకు కనిపించినా కానీ, ఇన్నర్ గా చాలా లోపాలు ఉన్నాయని రామ్ దేవ్ బాబా మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. సౌందర్యం పెంచుకునేందుకు, యవ్వనాన్ని కాపాడుకునేందుకు రెండు పెట్టెల మందులను తన ఇంట్లో ఉంచుకున్న షెఫాలి చర్యలు నిజంగా ప్రమాదకరమైనవని రామ్ దేవ్ బాబా మాటల్ని బట్టి అర్థం చేసుకోవాలి. సహజ సిద్ధంగా పుట్టుకొచ్చే ఉప్పత్తులను తినడం, ప్రకృతి జీవనం చేయడం నేటి మానవ ప్రపంచానికి చాలా అవసరం. ఒత్తిళ్ల మయమైన జీవితం నుంచి బయటపడడం చాలా ముఖ్యం.