నా బెడ్‌రూమ్ గురించి పగటి కలలు కనొద్దు : కంగనా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ ఫైర్ బ్రాండ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ ఫైర్ బ్రాండ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనపై చిన్న విమర్శ చేస్తేనే అవతలి వారు ఎవరు అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగడం మనం చూస్తూనే ఉంటాం. కంగనా ఎంతో మంది బాలీవుడ్ స్టార్స్ పై తీవ్ర స్థాయి ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరోలను సైతం వ్యక్తిగతంగా దుమ్మెత్తి పోసిన కంగనా ఇప్పుడు పార్లమెంట్‌లో తన గొంతు వినిపిస్తుంది. గత కొంత కాలంగా బాలీవుడ్ స్టార్స్ పై కానీ, బయట కానీ కంగనా పెద్దగా నోరు విప్పిన దాఖలాలు లేవు. మీడియా ముందు మాట్లాడినా ఆచితూచి మాట్లాడుతూ వచ్చింది. కంగనా ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కొనసాగింపు అన్నట్లు తాజాగా యోగా గురు బాబా రామ్ దేవ్ పై మాటల యుద్ధానికి తెరతీసింది. ఆయన చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందిస్తూ బాబాపై వ్యక్తిగత విమర్శలు చేసింది.
కంగనా రనౌత్‌పై బాబా రామ్‌దేవ్ వ్యాఖ్యలు...
కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల గురించి కంగనా మాట్లాడుతూ జెన్ జీ లపై తీవ్ర విమర్శలు చేసింది. జెన్ జీ అంటే జనరేషన్ గటర్ అని కంగనా చేసిన వ్యాఖ్యలను చాలా మంది తప్పుబడుతూ సోషల్ మీడియా ద్వారా ఆమె తీరును విమర్శించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాబా రామ్‌దేవ్ మాట్లాడుతూ కంగనా గటర్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. కంగనా చిన్నతనం, యవ్వనం, ఆమె గతం ఎలాంటివో తనకు తెలుసని వ్యక్తిగతంగా విమర్శలకు తెర తీశాడు. కంగనా పై వ్యక్తిగత హనన వ్యాఖ్యలు చేసిన బాబా రామ్‌దేవ్ పై సోషల్ మీడియాలోనూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఒక మహిళ గురించి, ఆమె వ్యక్తిత్వం గురించి, ఆమె గతం, చిన్నతనం గురించి మీరు ఎలా మాట్లాడుతారు అంటూ బాబా రామ్‌దేవ్ కి వ్యతిరేకంగా, కంగనాకు మద్దతుగా చాలా మంది సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఉన్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో కంగనా రియాక్షన్...
తాజాగా బాబా వ్యాఖ్యలపై కంగనా తనదైన శైలిలో కాస్త ఘాటుగానే స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కంగనా స్పందిస్తూ... బాబాజీ, నా యవ్వనం గురించి, నా బెడ్ రూమ్ గురించి మీరు పగటి కలలు కనడం మానేయండి. ఏది పడితే అది మాట్లాడొద్దు. పుకార్లను ఆధారంగా చేసుకుని మాట్లాడటం ఏమాత్రం కరెక్ట్ కాదు. మోసపూరిత ప్రకటనల విషయంలో కోర్ట్ మీపై ఆగ్రహం వ్యక్తం చేసి, తిట్టింది. కనీసం నన్ను అలా కూడా ఎవరూ ఏమీ అనలేదు. మీ క్యారెక్టర్ కంటే నా క్యారెక్టర్ చాలా ఉత్తమమైనదిగా చాలా మంది భావిస్తున్నారు. నేను చేసిన వ్యాఖ్యల విషయంలో ఎలాంటి మోసం లేదు, కనుక నా క్యారెక్టర్ గురించి మీరు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ కంగనా పోస్ట్ చేసింది. బాబా రామ్ దేవ్ పై కంగనా వ్యాఖ్యలను సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తూ ఆమెకు మద్దతుగా కొందరు, ఆమెను విమర్శిస్తూ కొందరు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
జెన్ జీలకు మద్దతుగా రామ్‌దేవ్ బాబా...
గతంలో బాబా రామ్‌దేవ్‌ను పతాంజలి యాడ్స్ విషయమై సుప్రీం కోర్ట్ తీవ్ర స్థాయిలో మందలించిన విషయం తెల్సిందే. ఆ విషయాన్ని ఇప్పుడు కంగనా ప్రస్థావిస్తూ బాబా ను టార్గెట్ చేయడంను కొందరు సమర్థిస్తూ ఉన్నారు. సుప్రీం కోర్ట్ చేత చివాట్లు తిన్న వ్యక్తి ఇప్పుడు కంగనా గురించి మాట్లాడటం హాస్యాస్పదం అంటూ చాలామంది బాబా పై విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి కంగనా, బాబా మధ్య ఫైట్ మెల్ల మెల్లగా ముదురుతూ వస్తోంది. కంగనా తాజా కామెంట్స్ కి బాబా నుంచి రియాక్షన్ ఉంటే కచ్చితంగా ఈ వివాదం మరింత ముందుకు వెళ్లడం ఖాయం అంటూ సోషల్ మీడియాలో కొందరు మాట్లాడుకుంటున్నారు. అయితే బాబా ఈ విషయాన్ని ఇంతటితో ఆపేస్తారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాబా నుంచి గట్టి రియాక్షన్ వస్తే కంగనా మరో రెండు మూడు అడుగులు ముందుకు వేసి సీరియస్ వ్యాఖ్యలు చేసిన ఆశ్చర్యం లేదు.