ఇప్పుడే వాటి గురించి చెప్పలేను : శ్రీలీల

ఒక ప్రైవేట్‌ కార్యక్రమంలో శ్రీలీల పాల్గొంది. ఆ సమయంలో మీడియా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.

Update: 2026-10-14 10:38 GMT

ఈ ఏడాదిలో పరాశక్తి, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీలీల ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఏంటంటే వెంటనే సమాధానం లేదు. ఆమె ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు. అయితే తమిళ్‌, హిందీ సినిమాలను చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటన రాలేదు. దాంతో శ్రీలీల హడావిడి తగ్గినట్లే అని, ఆమె ఇక మీదట పెద్దగా సినిమాలు చేయకపోవచ్చు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆ విషయమై శ్రీలీల స్పందించింది. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆమె వరుస సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. తీరికలేనంతగా శ్రీలీల షూటింగ్స్‌లో పాల్గొంటున్నట్లు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో, మీడియా సర్కిల్స్ లోనూ చర్చనీయాంశంగా మారాయి.

శ్రీలీల ప్రెస్‌ మీట్‌...

ఒక ప్రైవేట్‌ కార్యక్రమంలో శ్రీలీల పాల్గొంది. ఆ సమయంలో మీడియా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ముఖ్యంగా ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతూ తాను ఏం తిన్నా చివరకు పెరుగుతో తప్పకుండా తిని ముగిస్తానుంది అంది. చిన్నప్పటి నుంచి పెరగన్నం అంటే చాలా ఇష్టం. అందుకే తప్పకుండా తన మెనులో పెరుగన్నం ఉండేలా చూసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తనకు సాంబారు, పప్పు, కొబ్బరి అన్నం, కూర్మా చేయడం కూడా వచ్చని శ్రీలీల చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా హీరోయిన్స్‌ నేను తింటా కానీ వండలేను అంటారు. కానీ శ్రీలీల చాలా వంటలు ఈజీగా చేస్తాను అంటూ చెప్పడం జరిగింది. దాంతో శ్రీలీలను చేసుకోబోతున్న వాడు చాలా అదృష్టవంతుడు అంటూ కొందరు సరదాగా ఆమె వీడియోను షేర్‌ చేసి కామెంట్స్ చేస్తున్నారు.

వరుస సినిమాల్లో శ్రీలీల...

ఇక సినిమాల్లో ఎక్కువగా ఎందుకు కనిపించడం లేదు, మీ సినిమాలు ఈ మధ్య కాలంలో షూటింగ్‌ జరుగుతున్నట్లుగా అనిపించడం లేదు కారణం ఏంటంటూ ప్రశ్నించిన సమయంలో శ్రీలీల స్పందిస్తూ... షూటింగ్‌తో బిజీగా ఉన్నాను. ఇప్పుడే రెండు రోజులు బ్రేక్‌ తీసుకున్నాను. రెండు రోజుల బ్రేక్‌లో ఫ్యామిలీతో టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నాను. షూటింగ్స్‌ కారణంగా ఫ్యామిలీకి ఎక్కువ సమయం ఇవ్వలేక పోతున్న కారణంగా, ఇప్పుడు వచ్చిన బ్రేక్‌ ను ఫ్యామిలీ కోసం స్పెండ్‌ చేస్తున్నట్లుగా శ్రీలీల పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాలను ఆయా చిత్రాల యూనిట్‌ సభ్యులు అఫిషియల్‌గా అనౌన్స్ చేయలేదు. అందుకే నేను ఇప్పుడే ఆ సినిమాల గురించి చెప్పలేను, ఆ సినిమాలకు సంబంధించిన ఎలాంటి వివరాలు ఇప్పుడు చెప్పలేను అంటూ శ్రీలీల చెప్పుకొచ్చింది.

మాస్ జాతర సినిమా తర్వాత....

మొత్తానికి శ్రీలీల ఈ ఏడాది ఆరంభం నుంచి ఖాళీగానే ఉంది అంటూ వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చింది. శ్రీలీల తీరిక లేనంత బిజీగా షూటింగ్స్‌ చేస్తూనే ఉంది. అంటే ఆమె నుంచి వచ్చే ఏడాది కనీసం మూడు నాలుగు సినిమాలు అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు తెలుగులో ఈమె నటిస్తున్న సినిమా ఏంటి అనే విషయమై క్లారిటీ రాలేదు. తెలుగులో ఈమె హీరోయిన్‌గా మరిన్ని సినిమాలు చేయాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులో ఈమె చివరగా గత ఏడాది మాస్‌ జాతరతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఫలితం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో ఈమె చివరగా పుష్ప లోని ఐటెం సాంగ్స్‌ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత నుంచి పెద్దగా కనిపించడం లేదు అనే విమర్శలు ఎదుర్కొంటుంది. మరి శ్రీలీల వచ్చే ఏడాదిలో అయినా మెప్పించేనా చూడాలి.





Tags:    

Similar News