రాజమౌళి మాస్టర్ క్లాస్ టైమ్‌లైన్ ఎలా ప్లాన్ చేసారంటే?
దర్శకధీరుడు రాజమౌళి ప్రణాళికలు సాధారణంగా ఉండవు. ఆయన సినిమా మొదలుపెట్టారంటే? షూటింగ్ నుంచి ప్రమోషన్ల వరకు ప్రతీదీ మాస్టర్ ప్లాన్ ప్రకారమే శరవేగంగా జరుగుతుంది.
దర్శకధీరుడు రాజమౌళి ప్రణాళికలు సాధారణంగా ఉండవు. ఆయన సినిమా మొదలుపెట్టారంటే? షూటింగ్ నుంచి ప్రమోషన్ల వరకు ప్రతీదీ మాస్టర్ ప్లాన్ ప్రకారమే శరవేగంగా జరుగుతుంది. సూపర్ స్టార్ మహేష్ కథానా యకుడిగా, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ స్టైలిష్ యాక్షన్ డ్రామా `వారాణసి` విషయంలోనూ జక్కన్న అదే వేగాన్ని కొనసాగిస్తున్నారు. ఎలాంటి విరామం తీసుకోకుండా నిరంతరం శ్రమిస్తున్న రాజమౌళి ప్రాజెక్ట్‌పై పూర్తి దృష్టి సారించి పనులను శరవేగంగా ముందుకు నడిపిస్తున్నారు.
అయితే నిరంతరం బిజీగా ఉండే రాజమౌళి హఠాత్తుగా షూటింగ్‌కు విరామం ఇచ్చి కుటుంబంతో కలిసి అమెరికా పయనమవ్వడం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఒక కుటుంబ శుభకార్యం కోసం ఆయన యూఎస్ వెళ్లినా? ఈ విరామం వెనుక వర్క్ మేనేజ్మెంట్ - పక్కా టైమ్‌లైన్ ప్లానింగ్ కనిపిస్తోందని విశ్లేషకులు భావి స్తున్నారు. జక్కన్న టీమ్‌కు స్పష్టమైన డెడ్లైన్లు నిర్దేశించి.. పోస్ట్-ప్రొడక్షన్ పనులు సజావుగా సాగేలా చేసి.. ఈ వారం రోజుల విరామాన్ని తీసుకున్నారు.
ఇప్పటికే `వారాణసి` టాకీ పార్ట్ - ప్రధాన షూటింగ్ దాదాపు పూర్తయినట్లే. ప్లాన్ ప్రకారమే పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అమెరికా పర్యటన ముగించుకుని వారం రోజుల్లో హైదరాబాద్‌కు తిరిగి రానున్న రాజమౌళి బ్యాలెన్స్ షూటింగ్‌ను నవంబర్ కంటే ముందే పూర్తి చేయడానికి పక్కా షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు. షూటింగ్ - పోస్ట్-ప్రొడక్షన్లను సమాంతరంగా నడిపించడమే రాజమౌళి అనుసరిస్తున్న ప్రధాన వ్యూహం.
అన్ని అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 7 2027న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయనున్నారు. ఎక్కడా ఎలాంటి జాప్యం జరగకుండా అనుకున్న తేదీకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే ధ్యేయంగా రాజమౌళి అడుగులు వేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పలు భాషల్లో ఏకకాలంలో విడుదలకు సిద్ధమవుతున్న భారీ ప్రాజెక్ట్ విషయంలో విడుదలకు రెండు నెలల ముందే అనగా ఫిబ్రవరి చివరినాటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నింటినీ సంపూర్ణంగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.
రాజమౌళి మార్క్ గ్లోబల్ ప్రమోషన్ల కోసం ప్రత్యేకంగా ఒక నెలను కేటాయించడం మరో కీలకమైన అంశం. మార్చి మొత్తాన్ని `వారాణసి` అంతర్జాతీయ ప్రమోషన్ల కోసం కేటాయించారు. రాజమౌళితో పాటు మహేష్ , ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లు వివిధ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై హోరెత్తించేలా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గ్లోబల్ స్థాయిలో సినిమాను ఆడియన్స్‌కి తీసుకెళ్లడానికి ఇది ఎంతో కీలకమైన వ్యూహంగా మారనుంది.
ఏప్రిల్ 2027 విడుదల కోసం ఇప్పటినుంచే పక్కా డెడ్లైన్లు పెట్టుకుని మార్చినాటికి ప్రమోషన్లు, ఫిబ్రవరి నాటికి పోస్ట్-ప్రొడక్షన్, నవంబర్ నాటికి షూటింగ్ ముగించేలా రాజమౌళి టైమ్‌లైన్ అద్భుతం. అందుకే వచ్చే ఏడాది పనిభారం ..సుడిగాలి పర్యటనలు ఉండే అవకాశమున్నందున దొరికిన సమయాన్ని రాజమౌళి విరామంగా వినియోగించుకుంటున్నారు.