ట్రెడిషనల్ లుక్‌లో యాంకర్ అనసూయ.. అదిరిపోయే ఫొటోలు!
సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ పేరు వింటేనే యూత్‌లో ఒక ప్రత్యేకమైన జోష్ వస్తుంది.
సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ పేరు వింటేనే యూత్‌లో ఒక ప్రత్యేకమైన జోష్ వస్తుంది. ఈ హాట్ బ్యూటీ ఏ ఫోటోషూట్ షేర్ చేసినా క్షణాల్లో వైరల్ అవ్వడం సర్వసాధారణం. సాధారణంగా 35 ఏళ్లు దాటాక ఎవరికైనా వయసు ఛాయలు, శారీరక మార్పులు కనిపిస్తుంటాయి. కానీ,యసు పెరుగుతున్నా అనసూయ అందం మాత్రం తగ్గడం లేదు. టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె ట్రెడిషనల్ చీరకట్టులో దిగిన లేటెస్ట్ ఫొటోలు నెట్టింట గుబులు పుట్టిస్తున్నాయి. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ట్రెడిషనల్ అండ్ మోడ్రన్ ఫ్యూజన్ లుక్:
అనసూయ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోల్లో ఆమె లుక్ పూర్తిగా హైలైట్ అవుతోంది. ట్రెడిషనల్ హ్యాండ్లూమ్ను కంటెంపరరీ స్టైల్‌తో మిక్స్ చేసి ఆమె ఈసారి అందరినీ అట్రాక్ట్ చేసింది. రిచ్ కాపర్-మెటాలిక్ ట్రెడిషనల్ సిల్క్ చీరపై ఉన్న అందమైన జరీ బోర్డర్ భారతీయ నేత కళా నైపుణ్యానికి అద్దం పడుతోంది. ఇక ఈ చీరకు తను ధరించిన బ్లౌజ్ మరింత స్పెషల్‌గా నిలిచింది. స్లీవ్‌లెస్, హై-షైన్ మెటాలిక్ హాల్టర్-నెక్ బ్లౌజ్ ఈ ట్రెడిషనల్ లుక్‌కి ఒక మోడ్రన్ టచ్‌నిచ్చింది.
ఫ్యాన్స్ ఫిదా.. నెట్టింట వైరల్ కామెంట్స్:
అనసూయ పోస్ట్ పెట్టిన నిమిషాల వ్యవధిలోనే ఈ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఫ్యాన్స్ అయితే "బ్యూటిఫుల్", "స్ట్రక్చర్ క్వీన్" అంటూ రకరకాల కామెంట్లతో పోస్టును నింపేస్తున్నారు. ఎప్పటికప్పుడు తన గ్లామర్ అందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసే అనసూయ, ఈసారి ట్రెడిషనల్ వేర్‌లోనూ తనదైన గ్లామర్ యాడ్ చేసి అందరి హృదయాలను కొల్లగొట్టింది. ఇక నూకేశ్ మల్లా మేకప్, మహేష్ రావులపల్లి హెయిర్ స్టైలింగ్ ఈ లుక్‌ను మరింత పర్ఫెక్ట్గా మార్చాయి.
సినిమాల్లోనూ దూసుకుపోతున్న యాంకర్:
కేవలం సోషల్ మీడియా ట్రెండ్స్, గ్లామర్ షో మాత్రమే కాకుండా నటిగానూ అనసూయ తన సత్తా చాటుతోంది. విభిన్నమైన కథలను, పాత్రలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ ఏడాది వచ్చిన ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రంలో ఆమె పోషించిన ‘లీలావతి’ పాత్రకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక గ్లామర్, ఫిట్నెస్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఇక మొత్తానికి చూస్తే, వయసు ఎప్పటికీ నెంబర్ మాత్రమేనని నిరూపిస్తూ అనసూయ భరద్వాజ్ రోజురోజుకూ మరింత అందంగా తయారవుతున్నారు. ట్రెడిషనల్ చీరలోనూ మోడ్రన్ స్టైల్ ఉట్టిపడేలా ఆమె చేసిన ఈ ఫొటోషూట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇక గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ముందుకు సాగుతున్న అనసూయ, మున్ముందు మరెన్నో వైవిధ్యమైన ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను అలరించడం ఖాయం.