అక్కడ రూ.50 కోట్లు, ఇక్కడ రూ.50 లక్షలు

ఎన్నికలు, ఐపీఎల్‌ మరియు ఎండ వేడి కారణంగా జనాలు థియేటర్ల వైపు చూసే పరిస్థితి లేదు.

Update: 2024-05-09 11:30 GMT

ఎన్నికలు, ఐపీఎల్‌ మరియు ఎండ వేడి కారణంగా జనాలు థియేటర్ల వైపు చూసే పరిస్థితి లేదు. ఈ మూడు కారణాల వల్ల పెద్ద సినిమాలు కొన్ని విడుదల వాయిదా పడ్డాయి. ఈ మే నెల మొత్తం కూడా వృదా అవ్వబోతుంది. మీడియం రేంజ్ సినిమాలు వచ్చినా జనాలు పట్టించుకునే పరిస్థితి లేదు అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా అరణ్మణై 4 హిట్ అయ్యింది.

తమిళనాట అరణ్మణై 4 సినిమా మొదటి వారం రోజుల్లో ఏకంగా రూ.55 కోట్ల వసూళ్లు నమోదు చేయడం ప్రస్తుతం టాక్ ఆఫ్‌ ది పాన్‌ ఇండియా అయ్యింది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ మిడ్‌ రేంజ్ మూవీ కూడా ఈ స్థాయిలో వసూళ్లు నమోదు చేసింది లేదు. కానీ తమిళ ప్రేక్షకులు మాత్రం అరణ్మణై 4 కి బ్రహ్మరథం పడుతున్నారు.

ఇప్పటికే తమిళనాట పార్లమెంట్‌ ఎన్నికలు పూర్తి అవ్వడం వల్ల జనాలు కాస్త థియేటర్ల వైపు మళ్లి ఉంటారు అనేది కొందరి అభిప్రాయం అయితే మరి కొందరు ఇలాంటి కాన్సెప్ట్‌ సినిమాలను తమిళ ప్రేక్షకులు ఆధరిస్తారు అంటూ మరోసారి నిరూపితం అయ్యిందని బాక్సాఫీస్‌ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

తమిళ్ లో రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన అరణ్మణై 4 ను తెలుగు లో బాక్ గా విడుదల అయ్యింది. ఇద్దరు ముద్దుగుమ్మలకు తెలుగు లో మంచి గుర్తింపు ఉంది. కనుక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు.

Read more!

ఈ అరవ డబ్బింగ్‌ మూవీని తెలుగు ప్రేక్షకులు పట్టించుకోలేదు. బాక్‌ గా తెలుగు లో డబ్‌ చేసినా, ఇద్దరు తెలుగు ముద్దుగుమ్మలు ఉన్నా కూడా ప్రేక్షకులు థియేటర్ల బాట పట్టలేదు. తమిళనాట రూ.50 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.50 లక్షల షేర్‌ ను కూడా రాబట్టలేక పోయింది అంటూ బాక్సాఫీస్ వర్గాల టాక్.

మిల్కీ బ్యూటీ తమన్నా మరియు అందాల రాశి ఖన్నా లు కలిసి నటించినా కూడా జనాలు పట్టించుకోలేదు. కామెడీ తో పాటు హర్రర్‌ ఉండే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు లైట్‌ తీసుకోవడం తో పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదని సమాచారం అందుతోంది.

Tags:    

Similar News