ఎక్కడ చూసినా భజ గోవిందం పాటే
దర్శకుడిగా కిరణ్ అబ్బవరం అభిరుచి ఈ పాటలో కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సినిమా ప్రమోషన్స్‌లో మ్యూజిక్కు ఉండే పవర్ వేరు. ఒక్క పాట క్లిక్ అయితే చాలు.. సినిమా గురించి ప్రేక్షకుల్లో చర్చ మొదలవుతుంది. సోషల్ మీడియాలో రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, వాట్సాప్ స్టేటస్‌ల రూపంలో ఆ పాట మరింత మందికి చేరువవుతుంది. ఇప్పుడు కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ సినిమా విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ సినిమా నుంచి వచ్చిన ‘భజ గోవిందం’ పాట ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం.. ‘రియాలిటీ’తో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. నిర్మాత సుధాకర్ చాగంటికి ఇది తొలి సినిమా కావడం విశేషం. తాజాగా రియాలిటీ నుంఛి విడుదలైన ‘భజ గోవిందం’ పాట వైరల్ అయ్యింది. జాతీయ అవార్డు గ్రహీత వైకోమ్ విజయలక్ష్మి తన ప్రత్యేకమైన గాత్రంతో ఆలపించిన ఈ పాట శ్రోతలను విశేషంగాఆకట్టుకుంటోంది. ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఈ పాటకు సంబంధించిన రీల్‌ను షేర్ చేయడం దీని క్రేజ్‌కు నిదర్శనం.
ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సనారే రాసిన సాహిత్యం జీవితంలోని అనుభవాలను గుర్తుచేస్తూ పాటకు భావోద్వేగాన్ని జోడించింది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల జీవనశైలిని ప్రతిబింబించే విజువల్స్ పాటకు మరింత సహజత్వాన్ని తీసుకొచ్చాయి. ఇది కేవలం వినడానికి బాగున్న పాటగానే కాకుండా, ప్రేక్షకులు తమ జీవితాలతో పోల్చుకునే పాటగా మారుతోంది.
దర్శకుడిగా కిరణ్ అబ్బవరం అభిరుచి ఈ పాటలో కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో కొనసాగుతున్న ఈ క్రేజ్ ‘రియాలిటీ’ సినిమాపై అంచనాలను పెంచుతోంది.
‘రియాలిటీ’ టీజర్‌కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చాలా రియలిస్టిక్‌గా ఉండటంతో పాటు, అందరికీ కనెక్ట్ అయ్యే కథతో సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది.
దర్శకుడిగా కిరణ్ అబ్బవరం తన తొలి సినిమాతోనే ప్రేక్షకులకు చేరువయ్యే కథను ఎంచుకున్నారని టీజర్, పాట చూస్తే అర్థమవుతోంది. ఇప్పటివరకు విడుదలైన కంటెంట్ చూస్తుంటే, దర్శకుడిగా తొలి ప్రయత్నంతోనే కిరణ్ అబ్బవరం మంచి విజయాన్ని అందుకునేలా కనిపిస్తున్నారు.