గాడ్ ఆఫ్ వార్ లో తార‌క్ జోడీ?

హీరోయిన్ పాత్ర విష‌యంలో గురూజీ ఎక్క‌డా రాజీ ప‌డ‌రు. ఆయ‌న ఏ సినిమా తీసుకున్నా? అందులో హీరోయిన్ కు త‌గిన ప్రాధాన్య‌త ఉంటుంది.

Update: 2026-10-26 17:30 GMT

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ గ్రాండ్ ప్రాజెక్ట్ లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. వర్కింగ్ టైటిల్‌గా `గాడ్ ఆఫ్ వార్` అనే ఆసక్తికర పేరు ప్రచారంలో ఉంది. ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. మైథ‌లాజిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో గురూజీ తెర‌కెక్కిస్తోన్న ఇంటెన్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విష‌యం వైర‌ల్ అవుతోంది. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ న‌టి అలియా భట్ ను దించేందుకు త్రివిక్రమ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు స‌మాచారం.

 

పాన్ ఇండియా స్థాయిలో భారీ కాన్వాస్‌పై నిర్మిస్తుండటంతో కథకు తగినట్లుగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న నటి అయితేనే పర్ఫెక్ట్‌గా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారుట‌. ఈ క్రమంలోనే తారక్‌కి జోడీగా అలియా భట్‌ను రంగంలోకి దించేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి తెరకెక్కించిన `ఆర్ఆర్ఆర్` లో జూనియర్ ఎన్టీఆర్ అలియా భట్ కలిసి న‌టించినా? వారిద్దరి మధ్య కాంబినేషన్ సీన్స్ కానీ.. పూర్తిస్థాయి రోమాంటిక్ ట్రాక్ కానీ లేదు. `గాడ్ ఆఫ్ వార్` ప్రాజెక్ట్ ఓకే అయితే మాత్రం ఇద్ద‌రి కాంబినేషన్ తెరపై పూర్తి స్థాయిలో అలరించడం ఖాయం.

ఈ కాంబో కుదిరితే బిజినెస్ పరంగా.. క్రేజ్ పరంగా నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లడం ఖాయం. పాన్ ఇండియాలో కథలో వైవిధ్యంతో పాటు నటీనటుల ఎంపికలోనూ బాలీవుడ్ స్టార్లను భాగస్వాములను చేయడం ద్వారా ఉత్తరాది మార్కెట్‌లో కూడా తిరుగులేని పట్టు సాధించొచ్చు. అలియా భట్ ప్రతిభ, నార్త్ ఇండియన్ క్రేజ్ చిత్రానికి అదనపు బలంగా మారుతాయని చిత్ర బృందం లెక్కలు వేస్తోంది. ఇందులో ఎన్టీఆర్ పాత్ర అత్యంత శక్తివంతంగా, మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో ఉండబోతోందని స‌మాచారం. త్రివిక్రమ్ మార్క్ సంభాషణలు, కథనంతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే ఛాన్స్ ఉంది.

హీరోయిన్ పాత్ర విష‌యంలో గురూజీ ఎక్క‌డా రాజీ ప‌డ‌రు. ఆయ‌న ఏ సినిమా తీసుకున్నా? అందులో హీరోయిన్ కు త‌గిన ప్రాధాన్య‌త ఉంటుంది. పాన్ ఇండియా సినిమా అంటే? అంత‌కు రెండింత‌లు హీరోయిన్ పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉంటుంద‌న్న‌ది కాద‌న‌లేని నిజం. ప్రస్తుతం కాస్టింగ్ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నా? త్వరలోనే అలియా భట్ ఎంట్రీపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. `దేవర`, `వార్ 2` చిత్రాల తర్వాత తారక్ చేస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో అలియా భట్ నిజంగానే భాగమైతే అభిమానులకు పండ‌గే. అలియాభ‌ట్ కూడా ఆఫ‌ర్ ని కాద‌నే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయి. `ఆర్ ఆర్ ఆర్` త‌ర్వాత ప‌లువురు ద‌ర్శ‌కులు కోరినా? అమ్మ‌డు నో చెప్పింది. కానీ మ‌రోసారి తార‌క్ తోనే న‌టించే అవ‌కాశం వ‌చ్చింది కాబ‌ట్టి నో చెప్ప‌డానికి ఛాన్సెస్ త‌క్కువ‌గానే ఉంటాయి.

Tags:    

Similar News