బాహుబలి... ఇప్పుడు జక్కన్న తగ్గట్లేదట!

బాహుబలి ది ఎపిక్‌ను చాలా మంది కేవలం రెండు పార్ట్‌లను కలిపి విడుదల చేస్తున్నారు, దీనికి పెద్ద ఖర్చు ఏముంది అనుకుంటున్నారు.;

Update: 2025-10-09 07:37 GMT

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి, ప్రభాస్ కాంబోలో వచ్చిన అద్భుతమైన విజువల్‌ వండర్‌ బాహుబలి. రెండు పార్ట్‌లుగా వచ్చిన బాహుబలి సినిమా తెలుగు సినిమా స్థాయిని ఆకాశంలో నిలిపింది, అదే సమయంలో ఇండియన్‌ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి బాహుబలి తీసుకు వెళ్లి నిలిపింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతకు ముందు వరకు ఇండియన్ సినీ ప్రేమికులు చూడని అద్భుతమైన విజువల్స్‌ను, గ్రాఫిక్స్‌ను రాజమౌళి బాహుబలిలో చూపించి సర్‌ప్రైజ్ చేశాడు. ఇది ఇండియాలో రూపొందిన మూవీనా అని అనుకునేలా హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ సైతం ఆశ్చర్యపడే విధంగా రాజమౌళి బాహుబలి సినిమాను రూపొందించాడు. ఇప్పుడు రెండు పార్ట్‌లను కలిపి బాహుబలి ది ఎపిక్‌ అంటూ ఒక పార్ట్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. అక్టోబర్‌ 31న సినిమా విడుదల కాబోతుంది.

బాహుబలి ది ఎపిక్‌ రిలీజ్‌ డేట్‌

బాహుబలి ది ఎపిక్‌ను చాలా మంది కేవలం రెండు పార్ట్‌లను కలిపి విడుదల చేస్తున్నారు, దీనికి పెద్ద ఖర్చు ఏముంది అనుకుంటున్నారు. రెండు పార్ట్‌ల్లో అవసరం లేదు అనుకున్న సీన్స్‌ను లేపేసి, కొన్ని సీన్స్‌ను ట్రిమ్‌ చేసి ఓవరాల్‌గా ఒక పార్ట్‌గా మూడు గంటల పాటు ఉండేలా ఎడిటింగ్‌ చేసి వదులుతారు అనుకుంటున్నారు. కానీ అలా కాదు, రాజమౌళి ఏం చేసినా చాలా స్పెషల్‌ గా ఉంటుంది. అలా సింపుల్‌గా రెండు పార్ట్‌లను ఒక పార్ట్‌గా ఎడిట్‌ చేసి విడుదల చేస్తే అది రాజమౌళి సినిమా ఎలా అవుతుంది, అలా చేస్తే రాజమౌళి జక్కన్న ఎందుకు అవుతాడు. ఈ బాహుబలి ది ఎపిక్‌ మూవీకి సంబంధించిన వర్క్‌ దాదాపుగా ఏడాది కాలంగా నడుస్తోంది. ఈ ఏడాది కాలంగా కేవలం ఎడిటింగ్‌ మాత్రమే కాకుండా పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ చాలా జరుగుతుందట. రీ రికార్డింగ్‌ మొదలుకుని గ్రాఫిక్స్ వరకు చాలా మార్పులు కనిపించబోతున్నాయట.

టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు..

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బాహుబలి ది ఎపిక్‌ సినిమా కోసం నిర్మాతలు చేస్తున్న ఖర్చుతో ఒక మీడియం రేంజ్ హీరోతో, మంచి హై బడ్జెట్‌ మూవీ తీసేయవచ్చు అంటున్నారు. ఈ సినిమా కోసం వినియోగిస్తున్న గ్రాఫిక్స్ వర్క్‌ సైతం అత్యాధునిక టెక్నాలజీతో ఉంటుందని అంటున్నారు. మొత్తానికి రాజమౌళి ఇది ఉన్న సినిమానే కదా, ఎడిట్‌ చేసి విడుదల చేసేద్దాం అనుకోలేదు. ఇది ఖచ్చితంగా ఒక మంచి సినిమాగా, కొత్త అనుభూతిని ఇచ్చే విధంగా ఉండాలి అనుకుంటూ సినిమాను రెడీ చేస్తున్నాడు. సినిమా కోసం చేస్తున్న ఖర్చుకు ప్రమోషన్ ఖర్చు అదనంగా ఉండబోతుంది. సినిమా విడుదలకు మరో రెండు వారాల సమయం ఉంది. ఈ రెండు వారాల్లో సినిమాను భారీ ఎత్తున ప్రమోట్‌ చేయడం కోసం నిర్మాతలు పెద్ద మొత్తంలో ఖర్చు పెడతారు అనే వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్ బాహుబలి కలెక్షన్స్‌

మొత్తానికి బాహుబలి ది ఎపిక్‌ టైటిల్‌ తో రాబోతున్న ఈ సినిమాను సరికొత్త మూవీగా ప్రేక్షకులు ఫీల్‌ కావడానికి సాధ్యం అయినన్ని అన్ని మార్పులు చేర్పులను రాజమౌళి అండ్‌ టీం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇందుకోసం అవుతున్న ఖర్చుకు రెండు మూడు రెట్లు వసూళ్ల రూపంలో వస్తాయనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా మరోసారి నిర్మాతలకు కాసుల పంట పడించడం ఖాయం అని, రాజమౌళి స్థాయిని ఆకాశానికి ఎత్తడం, తెలుగు సినిమా స్టామినాను మరోసారి ప్రపంచానికి చూపించడం ఖాయం అంటున్నారు. ఈ సినిమాను కేవలం తెలుగులో మాత్రమే కాకుండా పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ ఎత్తున విడుదల చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. బాహుబలి ది ఎపిక్‌ కారణంగా రాజమౌళి మాస్‌ జాతర వాయిదా వేస్తారనే ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Tags:    

Similar News