'బాహుబలి ఎపిక్' సవాల్.. టాప్ 10 రీ రిలీజ్ రికార్డులు బద్దలవుతాయా?

గత కొంతకాలంగా టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ ఒక మాస్ వైబ్ లా మారిపోయింది.;

Update: 2025-10-16 06:56 GMT

గత కొంతకాలంగా టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ ఒక మాస్ వైబ్ లా మారిపోయింది. తమ ఫేవరెట్ హీరోల పాత బ్లాక్‌బస్టర్లను 4K టెక్నాలజీతో మళ్లీ తెరపై చూసి ఎంజాయ్ చేయడానికి అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ ట్రెండ్‌లో ఎన్నో సినిమాలు మంచి వసూళ్లు సాధించి, రీ రిలీజ్‌లకు కూడా ఒక మార్కెట్ ఉందని నిరూపించాయి. ఇప్పుడు ఈ బరిలోకి ఇండియన్ సినిమా దిశను మార్చిన చిత్రం అడుగుపెడుతోంది. అదే బాహుబలి.

అయితే ఇది కేవలం పాత ప్రింట్‌ను మళ్లీ వేయడం కాదు, సరికొత్త హంగులతో బాహుబలి: ది ఎపిక్ గా రాబోతోంది. ఈ 'ఎపిక్' వెర్షన్ ప్రత్యేకత ఏంటంటే, ఇది కేవలం రెండు భాగాలను కలిపి ప్రదర్శించడం మాత్రమే కాదు. నిర్మాత శోభు యార్లగడ్డ చెప్పిన దాని ప్రకారం, ఈ స్పెషల్ వెర్షన్‌లో సినిమాటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటు, ఇప్పటివరకు ఎవరూ చూడని కొన్ని కొత్త సన్నివేశాలు (అన్‌సీన్ షాట్స్) కూడా జోడించనున్నారు.

ఇది ‘బాహుబలి’ని ఇప్పటికే వందల సార్లు చూసిన ప్రేక్షకుడికి కూడా ఒక కొత్త అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఈ కొత్త కంటెంట్ అనే అంశమే ఈ రీ రిలీజ్‌పై అంచనాలను పెంచుతోంది. ఈ రీ రిలీజ్ ప్లానింగ్ వెనుక ఒక పెద్ద వ్యూహమే ఉంది. ‘RRR’ చిత్రంతో రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గుర్తింపును ఈ ప్రాజెక్ట్‌కు ఒక బూస్ట్‌గా వాడుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

జక్కన్న మేకింగ్ స్టైల్‌కు ఫిదా అయిన గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ, ఓవర్సీస్‌లో భారీ ప్రమోషన్లతో ఈ ‘ఎపిక్’ వెర్షన్‌ను విడుదల చేయాలని చూస్తున్నారు. రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ ఈ రీ రిలీజ్‌కు అతిపెద్ద అస్సెట్‌గా మారనుంది.

అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. రీ రిలీజ్ మార్కెట్‌లో ఇప్పటికే కొన్ని సినిమాలు తమదైన రికార్డులను సృష్టించాయి. తమిళంలో ‘గిల్లి’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. తెలుగులో కూడా ‘ఖలేజా’, ‘గబ్బర్ సింగ్’ వంటి చిత్రాలు అద్భుతమైన వసూళ్లను రాబట్టాయి. మరి వీటన్నింటినీ దాటి, ‘బాహుబలి: ది ఎపిక్’ టాప్ 10 లిస్ట్‌లో నిలవగలదా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటివరకు టాప్ రీ రిలీజ్ కలెక్షన్లు:

గిల్లి 4K: 32.50CR

సచిన్: 13.60CR

ఖలేజా 4K: 10.78CR

మురారి 4K: 8.90CR

గబ్బర్ సింగ్ 4K: 8.01CR

ఖుషి: 7.46CR~

ఆర్య 2 రీ రిలీజ్ (2025): 6.75CR

SVSC రీ రిలీజ్: 6.60CR

అతడు 4K: 6.45CR

బిజినెస్‌మ్యాన్ 4K: 5.85Cr

ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ సినిమాలకు రెస్పాన్స్ కాస్త తగ్గింది. మొదట్లో ఉన్నంత ఊపు లేదు. ఇక ‘బాహుబలి’ చిత్రాన్ని ఇప్పటికే థియేటర్, టీవీ, ఓటీటీలలో ప్రేక్షకులు చాలాసార్లు చూశారు. కాబట్టి, కేవలం పాత సినిమాను చూడ్డానికి మళ్లీ థియేటర్‌కు రావడం కష్టమే. మేకర్స్ చెప్తున్న ఆ ‘కొత్త కంటెంట్’ ప్రేక్షకులను ఆకట్టుకుంటేనే ఈ సినిమా క్లిక్ అయ్యే అవకాశం ఉంది.

ఒరిజినల్ రిలీజ్‌లో బాక్సాఫీస్ వద్ద 2 వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన ‘బాహుబలి’, ఇప్పుడు ఈ రీ రిలీజ్ రికార్డులపైనా తన ఆధిపత్యాన్ని చూపిస్తుందో లేదో చూడాలి. ఒకవేళ ఈ రీ రిలీజ్ అంచనాలను అందుకోలేకపోతే, భవిష్యత్తులో పెద్ద సినిమాల రీ రిలీజ్ విషయంలో నిర్మాతలు ఆలోచించుకోవాల్సి రావచ్చు. ఇది ఒకరకంగా రీ రిలీజ్ మార్కెట్‌కు అగ్నిపరీక్ష లాంటిది.

Tags:    

Similar News