SSMB29: ప్రభాస్ లాగే ప్రయత్నం చేశాడు.. కానీ..

కానీ, రాజమౌళి ఆ మాత్రం దానికి లీక్ ఇస్తాడా? ప్రభాస్ అంత క్లోజ్ ఫ్రెండ్ అడిగినా సరే, జక్కన్న చాలా స్మార్ట్‌గా, నవ్వుతూనే ఆ టాపిక్‌ను డైవర్ట్ చేసేశాడు.;

Update: 2025-10-29 12:21 GMT

'బాహుబలి: ది ఎపిక్' రీ రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి, ప్రభాస్, రానా కలిసి చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 'బాహుబలి' నాటి జ్ఞాపకాలను వాళ్లు పంచుకుంటున్న తీరు ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చింది. అయితే, ఈ ఫన్ చిట్‌చాట్ చివరలో, ప్రభాస్ చాలా తెలివిగా రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్, అంటే మహేష్ బాబుతో చేస్తున్న SSMB29 గురించి చిన్న లీక్ లాగే ప్రయత్నం చేశాడు.

"మేము చాలా బిజీగా ఉన్నాం.. మరి మీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు సార్?" అని ప్రభాస్ చాలా క్యాజువల్‌గా అడిగేశాడు. ఆ పక్కనే రానా కూడా "మాకు ఏదైనా హింట్ ఇవ్వండి" అన్నట్లు సైగ చేశాడు. ఆ ఒక్క క్షణం ఆడియెన్స్ అంతా జక్కన్న ఏం చెప్తాడో అని ఎదురుచూశారు. ఎందుకంటే SSMB29 అనౌన్స్ అయినప్పటి నుంచి, ఆ సినిమా ఎలా ఉండబోతోందో అని ఊహాగానాలు తప్ప, అఫీషియల్ అప్‌డేట్స్ దాదాపు జీరో.

కానీ, రాజమౌళి ఆ మాత్రం దానికి లీక్ ఇస్తాడా? ప్రభాస్ అంత క్లోజ్ ఫ్రెండ్ అడిగినా సరే, జక్కన్న చాలా స్మార్ట్‌గా, నవ్వుతూనే ఆ టాపిక్‌ను డైవర్ట్ చేసేశాడు. "వెన్ ఇట్స్ పర్ఫెక్ట్" (అది పర్ఫెక్ట్‌గా సిద్ధమైనప్పుడు) అంటూ సింగిల్ లైన్‌లో ఆన్సర్ ఇచ్చి, మళ్లీ 'బాహుబలి' టాపిక్‌లోకి వెళ్లిపోయాడు. ఈ చిన్న ఇన్సిడెంట్ చూస్తే, రాజమౌళి తన ప్రాజెక్ట్‌ను ఎంత సీక్రెట్‌గా ఉంచుతున్నాడో, ఆ హైప్‌ను ఎలా మెయిన్‌టైన్ చేస్తున్నాడో అర్థమవుతుంది.

ఇప్పటివరకు రిలీజ్ చేసింది కేవలం ఒకే ఒక్క పోస్టర్.. అది కూడా మహేష్ బాబు లుక్ రివీల్ చేయకుండా, 'గ్లోబ్‌ట్రాటర్' అనే వర్కింగ్ టైటిల్‌తో. ఫస్ట్ రివీల్ నవంబర్ 2025లో ఉంటుందని ఆ పోస్టర్‌లో హింట్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభాస్ అడిగినా జక్కన్న చెప్పకపోవడంతో, ఆ నవంబర్ అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ మరింత పెరిగింది. ఇది రాజమౌళి మార్క్ ప్రమోషనల్ స్ట్రాటజీ.

ఎంత తక్కువ చెబితే, అంత ఎక్కువ క్యూరియాసిటీ పెరుగుతుంది. ఈ సీక్రెసీయే సినిమాపై అంచనాలను హై లెవెల్ కు తీసుకెళ్తోంది. మొత్తానికి, 'బాహుబలి' హీరో కూడా 'గ్లోబ్‌ట్రాటర్' సీక్రెట్స్ తెలుసుకోలేకపోయాడు. జక్కన్న మైండ్ నుంచి లీక్ రాబట్టడం అంత ఈజీ కాదని ఈ సరదా సంభాషణ మరోసారి ప్రూవ్ చేసింది. నవంబర్‌లో వచ్చే ఆ 'ఫస్ట్ రివీల్' కోసం ఇప్పుడు ఇండియా మొత్తం వెయిట్ చేస్తోంది.

Tags:    

Similar News