ఫ్రెండ్షిప్ డే స్పెషల్.. ఫన్నీ వీడియో పంచుకున్న బాహుబలి టీమ్!
అసలు విషయంలోకి వెళ్తే.. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీగా వచ్చిన చిత్రం బాహుబలి. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.;
ఈరోజు ఫ్రెండ్షిప్ డే కావడంతో సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా తమ స్నేహితులను గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలోనే చాలామంది మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. వాళ్లంతా కూడా వారి వారి స్నేహితులకు స్పెషల్ విషెస్ తెలియజేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా తాజాగా బాహుబలి టీం మాత్రం ప్రభాస్, రానా ఫ్రెండ్షిప్ కి సంబంధించి.. ఒక స్పెషల్ వీడియోని షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ సెట్లో ప్రభాస్ , రానా ఇంత క్లోజ్ గా ఉంటారా? ముఖ్యంగా ప్రభాస్ ఇంత ఫన్నీగా ఉంటారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీగా వచ్చిన చిత్రం బాహుబలి. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు కొనసాగింపుగా బాహుబలి 2 కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా అయితే ఏకంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సరికొత్త సంచలనం సృష్టించింది. ఇకపోతే ఈ ఏడాదికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అక్టోబర్ 31వ తేదీన రెండు సినిమాలలోని కీలక ఘట్టాలను ఎడిట్ చేసి మరీ బాహుబలి ది ఎపిక్ పేరిట ఒకే మూవీగా రిలీజ్ చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై అంచనాలు పెంచుతూ.. సందర్భాన్ని బట్టి వీడియోని రిలీజ్ చేస్తున్నారు చిత్ర బృందం. అందులో భాగంగానే ఈరోజు ఫ్రెండ్షిప్ డే కావడంతో సినిమా సెట్ నుండి ప్రభాస్ - రానా - అనుష్క శెట్టిలకు సంబంధించిన ఫన్నీ వీడియోని పంచుకున్నారు. అందులో ప్రభాస్ దేవా లేడు .. భల్లా లేడు.. ఏక్ నిరంజన్ అంటూ పాట పాడడం.. వెంటనే అనుష్క ఎంట్రీ ఇవ్వడంతో ఎంత పని చేసావు దేవసేన అని ప్రభాస్ అనడం.. అటు రానాతో కలిసి ప్రభాస్ చేసిన ఫన్నీ మొత్తం ఈ వీడియోలో చూడవచ్చు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ప్రభాస్ - రానా మధ్య ఫ్రెండ్షిప్ ని మరొకసారి ప్రూవ్ చేసింది ఈ వీడియో..
ఒక ప్రభాస్ విషయానికి వస్తే.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్.. ఈ సినిమా తర్వాత వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాలు చేస్తున్నారు. అలాగే కల్కి 2, సలార్ 2 వంటి సినిమాలు కూడా లైన్లో ఉన్న విషయం తెలిసిందే.