బిగ్ బాస్ హౌస్ నుంచి ఆమె ఎగ్జిట్.. రీజన్ ఏంటి..?
బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులోనే కాదు బిగ్ బాస్ సీజన్ 6 తమిళ్ లో అయేషా 9 వారాల పాటు హౌస్ లో ఉంది. హౌస్ లో తన ఆట, మాట తీరుతో అదరగొట్టేసింది.;
బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన అయేషా హౌస్ నుంచి బయటకు వెళ్తుందన్న టాక్ బయటకు వచ్చింది. సీజన్ 9 ఫైర్ స్టోర్మ్ గా వచ్చిన ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లో అయేషా చాలా ఎనర్జిటిక్ గా కనిపించింది. వచ్చీ రాగానే ఆమె హౌస్ లో మిగతా కంటెస్టెంట్స్ లా సేఫ్ ఆట ఆడకుండా పాత కంటెస్టెంట్స్ ని టార్గెట్ చేస్తూ ఆమె ఆడుతూ వచ్చింది. రెండు వారాల ఆటలోనే అయేషా ఎలాంటిది.. ఎలా ఆడుతుంది అన్న విషయం క్లారిటీ వచ్చింది.
అయేషా హౌస్ నుంచి బయటకు..
బిగ్ బాస్ సీజన్ 9లో అయేషా ఇప్పుడిప్పుడే ఆట మీద తన పట్టు సాధిస్తుందని తెలుస్తుంది. ఐతే ప్రస్తుతం హౌస్ లో దొంగల టాస్క్ నడుస్తుంది. అందులో కూడా ఆమె యాక్టివ్ గానే కనిపించింది. ఐతే లేటెస్ట్ గా అయేషా హౌస్ నుంచి బయటకు వచ్చేస్తుంది అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అదేంటి ఈ వారం నామినేషన్స్ లో కూడా ఆమె లేదు కదా అలాంటిది ఆమె ఎందుకు హౌస్ నుంచి ఎగ్జిట్ అవుతుంది అంటే.. ఏదో హెల్త్ ఇష్యూ వల్ల ఆమె బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తుందని అంటున్నారు.
బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులోనే కాదు బిగ్ బాస్ సీజన్ 6 తమిళ్ లో అయేషా 9 వారాల పాటు హౌస్ లో ఉంది. హౌస్ లో తన ఆట, మాట తీరుతో అదరగొట్టేసింది. తెలుగు, తమిళ సీరియల్స్ తో పాపులర్ అయిన అయేషా తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లో వైల్డ్ కార్డ్ గా వచ్చి ఇంప్రెస్ చేస్తుంది. వచ్చీరాగానే తనూజ బాండింగ్ గురించి ఆమెను నామినేట్ చేస్తూ ఎటాక్ చేసింది. ఇక ఈ వారం రీతు చౌదరిని నామినేట్ చేసి తన పాయింట్స్ ని చెప్పింది.
హెల్త్ ఇష్యూ వల్ల హౌస్ నుంచి బయటకు..
ఐతే అయేషా బిగ్ బాస్ సీజన్ 9 నుంచి హెల్త్ ప్రాబ్లెం వల్ల బయటకు వచ్చేస్తుందని అంటున్నారు. ఐతే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో త్వరలో తెలుస్తుంది. అయేషా ఈసారి సీజన్ 9లో చివరి దాకా ఉంటానని హోస్ట్ నాగార్జున దగ్గర చెప్పి వచ్చింది. అలాంటి ఆమె హౌస్ నుంచి హెల్త్ ఇష్యూ వల్ల ఎగ్జిట్ అవ్వడం కచ్చితంగా అందరికీ షాక్ ఇస్తుందని చెప్పొచ్చు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో కంటెస్టెంట్ గా ఉన్న అయేషా ఒకవేళ హౌస్ నుంచి హెల్త్ చెకప్ కోసం బయటకు వచ్చేస్తే తిరిగి మళ్లీ హౌస్ లోకి వెళ్తుందా లేదా పూర్తిగా ఈ సీజన్ కి గుడ్ బై చెప్పేస్తుందా అన్నది కూడా తెలియాల్సి ఉంది.