పిక్‌టాక్ : ముక్కు పుడకతో భలే ఉందే
ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు చిన్న వయసులోనే పరిచయం అయిన అవికా గౌర్.. మొదటి సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.;
హీరోయిన్స్ చాలా సినిమాల్లో పాత్రల కోసం ముక్కు పుడక ధరించి కనిపిస్తూ ఉంటారు. అయితే కొద్ది మంది మాత్రమే ముక్కును నిజంగా కుట్టించుకుని ముక్కు పుడక ధరిస్తూ ఉంటారు. చాలా అరుదుగా ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మలు ముక్కు పుడకతో బయట కనిపిస్తూ ఉంటారు. ముక్కుపుడక ధరించే ముద్దుగుమ్మల జాబితాలో అవికా గౌర్ నిలిచింది. చిన్నారి పెళ్లి కూతురు ఫేం అవికా గౌర్ టాలీవుడ్‌లో హిట్ కోసం, బిగ్ బ్రేక్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తోంది. తనకు ఉన్న గుర్తింపుతో హీరోయిన్‌గా సునాయాసంగా ఎంట్రీ ఇవ్వగలిగింది. కానీ అవికా గౌర్ ఆ తర్వాత కెరీర్‌లో మాత్రం నిలదొక్కుకోలేక ఇప్పటికీ కిందా మీదా పడుతూ కెరీర్‌లో ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది.
ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు చిన్న వయసులోనే పరిచయం అయిన అవికా గౌర్.. మొదటి సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. నటిగానూ మంచి మార్కులు దక్కించుకున్న అవికాకి ఆ వెంట వెంటనే మూడు నాలుగు సినిమాల్లో నటించే అవకాశాలు కూడా దక్కాయి. కానీ ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోవడంలో విఫలం అయ్యాయి. అందుకే ఆఫర్లు తగ్గాయి. సినిమాల్లో ఛాన్స్‌లు తగ్గడంతో చిన్న బ్రేక్ తీసుకుని కొత్త లుక్‌తో అవికా ఎంట్రీ ఇచ్చింది. రాజుగాది గది ప్రాంచైజీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన అవికా గౌర్ కి మరోసారి నిరాశే మిగిలింది.
సక్సెస్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా చిన్నా చితకా సినిమాలతో కెరీర్‌లో ముందుకు సాగుతున్న అవికా గౌర్ సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా భారీ ఎత్తున ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది. తన అందమైన ఫోటోలను షేర్ చేసి ఎప్పుడూ వార్తల్లో ఉండే అవికా గౌర్ తాజాగా మరోసారి తన ఫోటోను షేర్ చేసింది. అయితే ఈసారి తాను ముక్కు కుట్టించుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ముక్కు పుడక ఎవరి కోసం కుట్టించుకున్నది కూడా అందులో పేర్కొన్న అవికా ముద్దు ఈమోజీని షేర్ చేసింది. ముక్కు పుడకతో అవికా చాలా నేచురల్‌గా చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
అవికా గౌర్ రియల్ ముక్కు పుడకతో భలే ఉందని, క్యూట్‌గా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. అవికా ఇంత సాహసం చేయడంకు కారణం ఏంటి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎవరి కోసం ఈ ముక్కు పుడక అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అవికా కొత్త లుక్ కొత్తగా బాగుంది అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక అవికా సినిమాల విషయానికి వస్తే గత ఏడాది ఒకటి రెండు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లోనూ నటించింది. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా అలరించలేదు. అయితే నటిగా గుర్తింపు మాత్రం దక్కింది. అందుకే ముందు ముందు ముద్దుగుమ్మ అవికా కచ్చితంగా బిజీ అవుతుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది.