అర్జున్ సర్జా విషెస్.. విశ్వక్ సేన్ ఏమన్నారంటే?

సీనియర్‌ యాక్టర్ అర్జున్‌ సర్జా, యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ ల మధ్య ఒకప్పుడు నెలకొన్న డిస్ట్రబెన్స్ ఇప్పుడు క్లియర్ అయినట్లు కనిపిస్తోంది.;

Update: 2026-02-12 17:00 GMT

సీనియర్‌ యాక్టర్ అర్జున్‌ సర్జా, యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ ల మధ్య ఒకప్పుడు నెలకొన్న డిస్ట్రబెన్స్ ఇప్పుడు క్లియర్ అయినట్లు కనిపిస్తోంది. గతంలో ఓ ప్రాజెక్ట్‌ విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ఆ చిత్రం నిలిచిపోయింది. అప్పట్లో ఆ విషయం టాలీవుడ్‌ లో హాట్‌ టాపిక్‌ గా మారింది. అయితే ఇప్పుడు ఇద్దరూ ఒకరి సినిమాకు ఒకరు విషెస్ తెలుపుతూ పాజిటివ్‌ వైబ్‌ ను క్రియేట్ చేయడం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ వివాదంపై స్పందించిన అర్జున్‌.. గతం గతమే అన్నట్లుగా మాట్లాడారు. ఎవరి మీద కోపం పెట్టుకోకుండా ముందుకు సాగిపోవడమే మంచిదని చెప్పారు. జీవితంలో కొన్ని సందర్భాలు అనుకోకుండా జరుగుతాయని, వాటిని పెద్దగా పట్టించుకోకుండా ప్రతి ఒక్కరి జర్నీ వారు కొనసాగించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. విశ్వక్‌ సేన్‌ నటిస్తున్న ఫంకీ సినిమా మంచి విజయం సాధించాలని కూడా కోరుకున్నారు.

అంతేకాకుండా విశ్వక్‌ సేన్ ఇంట్లో భోజనం చేసిన రోజులు గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు విశ్వక్‌ సేన్‌.. అర్జున్ కామెంట్స్ పై రెస్పాండ్ అయ్యారు. తన అప్ కమింగ్ మూవీ ఫంకీ ఈవెంట్ లో అర్జున్‌ మాట్లాడిన తీరు తనకు చాలా నచ్చిందని తెలిపారు. "జీవితమంటే ఇదే. ఈరోజు ఉన్న కోపం రేపు ఉండదు" అంటూ ఫుల్ మెచ్యూరిటీతో స్పందించారు. అర్జున్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సీతాపయనం మూవీతో పాటు కపుల్‌ ఫ్రెండ్లీ వంటి చిత్రాలు కూడా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు.

అసలు వివాదం విషయానికి వస్తే.. 2022లో అర్జున్‌ దర్శకత్వంలో విశ్వక్‌ సేన్‌ హీరోగా, ఆయన కుమార్తె ఐశ్వర్య హీరోయిన్‌ గా ఓ సినిమా ప్రారంభమైంది. కొన్ని రోజుల పాటు షూటింగ్‌ కూడా జరిగింది. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో విశ్వక్‌ ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారు. దీంతో ఆ సినిమా నిలిచిపోయింది. ఇప్పుడు అదే కథలో మార్పులు చేసి ఐశ్వర్య – నిరంజన్‌ తో సీతాపయనం టైటిల్ తో అర్జున్‌ కొత్తగా తెరకెక్కించారు.

అయితే ఇప్పుడు విశ్వక్, ఐశ్వర్య వేర్వేరుగా నటించిన సినిమాలు వరుస రోజుల్లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. కామెడీ ఎంటర్టైనర్‌ గా అనుదీప్‌ కేవీ దర్శకత్వంలో రూపొందిన ఫంకీ మూవీ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుండగా, లవ్‌ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌ తో రూపొందిన సీతాపయనం ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది. ఒకప్పుడు ఒకే ప్రాజెక్ట్‌ లో కలిసి పని చేయాల్సిన ఇద్దరు ఇప్పుడు వేర్వేరు సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడటం గమనార్హం.

ఏదేమైనా గత విభేదాలను పక్కనపెట్టి ఒకరి సినిమా విజయాన్ని మరొకరు ఇప్పుడు విశ్వక్, అర్జున్ కోరుకోవడం మంచిదేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రొఫెషనల్‌ గా ముందుకు సాగుతూ ఒకరినొకరు గౌరవించుకోవడం వల్ల ఇండస్ట్రీలో హెల్తీ ఎన్విరాన్మెంట్ తీసుకొస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పుడు విశ్వక్ సేన్ ఫంకీ మూవీతో.. ఐశ్వర్య- అర్జున్ సీతా పయనం చిత్రంతో ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News