ఆగ‌స్టు లోటుని సెప్టెంబ‌ర్ అయినా తీరుస్తుందా?

ఆగ‌స్ట్ 15న ఇండిపెండెన్స్ సంద‌ర్భంగా వ‌చ్చే లాంగ్ వీకెండ్ కోసం ఎన్నో సినిమాలు పోటీ పడుతుంటాయి. ఎప్ప‌టిలానే ఈ ఇయ‌ర్ కూడా ఆ టైమ్ లో రెండు భారీ బ‌డ్జెట్ సినిమాలొచ్చాయి.;

Update: 2025-09-02 05:51 GMT

ఆగ‌స్ట్ 15న ఇండిపెండెన్స్ సంద‌ర్భంగా వ‌చ్చే లాంగ్ వీకెండ్ కోసం ఎన్నో సినిమాలు పోటీ పడుతుంటాయి. ఎప్ప‌టిలానే ఈ ఇయ‌ర్ కూడా ఆ టైమ్ లో రెండు భారీ బ‌డ్జెట్ సినిమాలొచ్చాయి. కానీ ఆ రెండు సినిమాలూ ఆడియ‌న్స్ పెట్టుకున్న అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయాయి. వార్2, కూలీ సినిమాలు భారీ అంచ‌నాల‌తో వ‌చ్చి బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టిన విష‌యం తెలిసిందే.

నిరాశ‌ను మిగిల్చిన ఆగ‌స్ట్

ఆ త‌ర్వాత అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ప‌ర‌దా సినిమాకు ఓ మోస్త‌రు టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆ సినిమాకు క‌లెక్ష‌న్లు రాలేదు. ఇక గ‌త వారం రిలీజైన నారా రోహిత్ సుంద‌ర‌కాండ సినిమాకు మిక్డ్స్ రివ్యూస్ వ‌చ్చిన‌ప్ప‌టికీ దానికీ క‌లెక్ష‌న్లు రాలేదు. ఇవి కాకుండా కొన్ని త‌క్కువ బ‌డ్జెట్ సినిమాలు కూడా ఆగ‌స్ట్ లో రిలీజ‌య్యాయి కానీ అవి ఎప్పుడొచ్చాయో ఎప్పుడెళ్లాయో కూడా తెలియ‌ని ప‌రిస్థితి.

సెప్టెంబ‌ర్ లో వారానికో క్రేజీ మూవీ

దీంతో మొత్తానికి 2025 ఆగ‌స్ట్ టాలీవుడ్ కు చాలా పెద్ద నిరాశ‌ను మిగిల్చింది. దీంతో ఇప్పుడు అంద‌రి దృష్టి సెప్టెంబ‌ర్ పైనే ఉంది. ఈ నెల‌లో ప‌లు క్రేజీ సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఘాటీ, మిరాయ్, కిష్కింధ‌పురి, ఓజి లాంటి పెద్ద సినిమాల‌తో సెప్టెంబ‌ర్ నెల రెడీ అయింది. ఒక్కో వారం ఒక్కో సినిమాతో ఈ ఇయ‌ర్ సెప్టెంబ‌ర్ మ‌రింత క్రేజీగా మారింది.

కంటెంటే కింగ్

అయితే గ‌త నెల‌లో వచ్చిన వార్2, కూలీ సినిమాలు చూశాక కేవ‌లం బ‌డ్జెట్, స్టార్ క్యాస్టింగ్ మాత్ర‌మే ఆడియ‌న్స్ ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌లేవ‌ని, స్ట్రాంగ్ స్క్రిప్ట్ మ‌రియు మంచి స్క్రీన్ ప్లే ఉన్న సినిమాల‌కే స‌క్సెస్ ద‌క్కుతుంద‌ని మ‌రోసారి అంద‌రికీ అర్థ‌మైంది. ఎలాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ లేకుండా ఆగ‌స్ట్ మిగిల్చిన లోటును సెప్టెంబ‌ర్ అయినా తీరుస్తుందేమో చూడాలి. మ‌రి.

Tags:    

Similar News