థియేటర్స్ కు ఆడియన్స్ రావడం లేదా? అది అబద్ధమేనా?
'ఆడియన్స్ థియేటర్స్ కు రావట్లేదు'.. 'సినిమాలు చూసేందుకు రావడం లేదు'.. ఇది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటలు.. గత రెండు మూడేళ్లుగా ఆ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి.;

'ఆడియన్స్ థియేటర్స్ కు రావట్లేదు'.. 'సినిమాలు చూసేందుకు రావడం లేదు'.. ఇది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటలు.. గత రెండు మూడేళ్లుగా ఆ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే థియేటర్స్ క్లోజ్ చేస్తామని కొందరు ఎగ్జిబిటర్లు అనౌన్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తుంటాయి. ఆడియన్స్ రాకపోవడం వల్ల లాభాలు రావడం లేదని చెబుతుంటారు.
కానీ థియేటర్స్ కు ఆడియన్స్ రావడం లేదన్న మాట అస్సలు నిజంగా కాదని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు థియేటర్స్ కు ఆడియన్స్ వెళ్తూనే ఉన్నారు. సినిమాలు చూస్తూనే ఉన్నారు. మేకర్స్ కు భారీ వసూళ్లు వచ్చేలా చేస్తున్నారు. మరి ఆడియన్స్ థియేటర్స్ కు వెళ్లకపోతే.. థియేట్రికల్ రన్ లో అన్ని వసూళ్లు ఎలా వస్తాయి?
కాబట్టి థియేటర్స్ కు ఆడియన్స్ వెళ్లడం లేదన్న మాట నిజం కాదు. మేకర్స్ నచ్చే సినిమాలు తీస్తే కచ్చితంగా వెళ్తారు. కంటెంట్ ఉండాలే కానీ మూవీలోని క్యాస్టింగ్.. మేకర్స్ పెట్టే బడ్జెట్.. అలాంటి అంశాలతో సంబంధం లేకుండా బ్రహ్మరథం పడుతున్నారు. ఓ రేంజ్ లో సినిమాలను ఆదరిస్తున్నారు.
రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం మూవీ విడుదలై ఎలాంటి రెస్పాన్స్ అందుకుందో అందరికీ తెలిసిందే. సంక్రాంతికి రిలీజ్ అయిన ఆ సినిమా.. భారీ వసూళ్లను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకుపైగా సొంతం చేసుకుంది. ఓపెన్ గా చెప్పాలంటే.. ఆడియన్స్ థియేటర్స్ కు వెళ్లకపోతే అంతటి వసూళ్లు రావు కదా!
అంతకుముందు సంక్రాంతికి వచ్చిన హనుమాన్ మూవీను ఓ రేంజ్ లో ఆదరించారు ఆడియన్స్. రిపీట్ మోడ్ లో థియేటర్స్ కు వెళ్లారు. అప్పుడు కూడా ఆ సినిమా మంచి వసూళ్లు సాధించింది. ఆ తర్వాత టిల్లు స్క్వేర్ ను కూడా పెద్ద ఎత్తున చూశారు. సూపర్ హిట్ గా మార్చారు. దేవర మూవీని ఆదరించారు.
ఇక పుష్ప సిరీస్ చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు సినిమాలు కూడా వేరే లెవెల్ ను ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించాయి. రీసెంట్ గా చెప్పాలంటే కోర్టు మూవీ.. చిన్న సినిమాగా విడుదలై మంచి విజయం సాధించింది. ఓ రేంజ్ లో ఇప్పటికీ మెప్పిస్తోంది. దీని బట్టి ఫైనల్ గా చెబుతుంది ఒకటే.. ఆడియన్స్ సినిమాలు చూస్తూనే ఉన్నారు.. థియేటర్స్ కు వెళ్తున్నారు.. మేకర్స్ నచ్చే సినిమాలు తీస్తేనే చూస్తారు.. అంతే తప్ప థియేటర్లకు రారని అనడం అబద్ధమే!