ఆత్రేయపై అక్కినేని కోపం ఎందుకంటే?
చక్రవర్తిగారు ఒక రోజులోనే ట్యాన్ ఇచ్చేసారు. ఆత్రేయ గారు మాత్రం అలా ఆలోచన చేస్తూ కూర్చున్నారు.అప్పుడే పాట ఎంత వరకూ వచ్చిందని నాగేశ్వరరావు గారు అడిగితే ఇంకా రాయలేదన్నారు.;
`ఏఎన్నార్` సినిమా పాటలు అప్పటికీ..ఇప్పటికీ..ఎప్పటికీ ఎవ్వెర్ గ్రీన్. అప్పట్లో ఆయన సినిమాల్లో ట్రెండ్ సెట్టర్ సాంగ్స్ ఎన్నో. ఎన్నో క్లాసిక్ సాంగ్స్ తో శ్రోతల్ని అలరించిన నటుడాయన. మ్యూజికల్ గా సినిమాను హిట్ చేయడం అప్పటి సంగీత దర్శకుల ప్రత్యేకత. కథానుగుణంగా పాటలు రచన..సంగీతం ఎంతో అద్భుతంగా ఉండేది. స్టోరీ తో పాటు పాటలు ట్రావెల్ అవుతుంటాయి. పాట రూపంలోనే సన్నివేశాన్ని అద్భుతంగా హైలైట్ చేసేవారు. అలాంటి లెజెండరీ నటుడుకి రచనా దిగ్గజం ఆత్రేయ ఎన్నో పాటలు రచించారు. ఇద్దరి కాంబినేషన్ లో ఎన్నో క్లాసిక్ సాంగ్స్ ఉన్నాయి.
అలాంటి గొప్ప పాటలు ఇచ్చిన ఆత్రేయపైనే అక్కినేని కోపగించుకున్నారని ఎంత మందికి తెలుసు? అవును ఈ విషయాన్ని దర్శకుడు కనకాల జయకుమార్ తాజాగా ఓ సందర్భంలో రివీల్ చేసారు. `శ్రీరంగ నీతులు` సినిమా నాగేశ్వరరావు గారి సొంత సినిమా. అందులో ఏఎన్నార్ కి జోడీగా శ్రీదేవి నటించారు. ఆ సినిమాకు కోదండరామిరెడ్డి దర్శకుడు...చక్రవర్తి సంగీతం అందించారు. అప్పుడే ఆ సినిమాకు ఓ పాట రాయడానికి ఆత్రేయగారిని పిలిపించారు. ఆ సినిమాకు నేను కో డైరెక్టర్ గా పనిచేసా. ఆత్రేయ గారు అశోక హోటల్లో దిగారు.
చక్రవర్తిగారు ఒక రోజులోనే ట్యాన్ ఇచ్చేసారు. ఆత్రేయ గారు మాత్రం అలా ఆలోచన చేస్తూ కూర్చున్నారు.అప్పుడే పాట ఎంత వరకూ వచ్చిందని నాగేశ్వరరావు గారు అడిగితే ఇంకా రాయలేదన్నారు. అలా రెండు మూడు సార్లు అడిగితే అదే సమాధానం వచ్చింది. అలా వారం గడించింది. దీంతో నాగేశ్వరరావు గారికి కోపం వచ్చింది. అప్పుడే ఇక ఇక్కడ ఉండాల్సిన పనిలేదు మీరు మద్రాస్ వెళ్లిపోవచ్చు అని కోపంగా అన్నారు.
అలా అనగానే ఆత్రేయగారు హోటల్ కి వచ్చేశారు. కనీసం పల్లవి అయినా రాయండని కోదండరామిరెడ్డి బ్రతిమ లాడారు. ఒక రోజు రాత్రి పడుకున్న తర్వాత ఆత్రేయ నన్ను పిలిచారు. పాట రాసుకోమని చెప్పి పల్లవి చెప్పారు. అలా రాసిన పాటే `కళ్లు ఒకే ..నడుము ఒకే` అనే పాట. ఉదయాన్నే ఆ పాట తీసుకెళ్లి అక్కినేని గారికి ఇస్తే కూల్ అయ్యారు. అక్కినేని గారి కోపంలో చిన్నపాటి అలక కూడా కనిపిస్తుంది. అది ఎంతో సరదాగా అనిపిస్తుంది. కూల్ అయిన సమయంలో ఆయన ముఖం ఎంతో పరిమళించిందన్నారు.