స్త్రీ 2 కాదు.. కుర్చీ అంచుపైకి జార‌డం గ్యారెంటీ!

సాయిప‌ల్ల‌వి, ఫ‌హ‌ద్ ఫాజిల్ న‌టించిన 2019 చిత్రం `అతిరన్` వీట‌న్నిటినీ కొట్టే సినిమా. వెన్ను జ‌ల‌ద‌రించే థ్రిల్స్ తో ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తుంది.;

Update: 2025-04-08 04:35 GMT

ప్ర‌తి ఫ్రేమ్‌లో గ‌గుర్పొడిచే థ్రిల్స్‌.. ఊపిరాడ‌నివ్వ‌ని ఉత్కంఠ‌.. ప్ర‌తి సీన్ ని కుర్చీ అంచుపైకి జారి చూడాల్సి వ‌స్తే...? అది గొప్ప స్క్రీన్ ప్లే.. క‌చ్ఛితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ అవుతుంది. ఇటీవ‌లి కాలంలో స్త్రీ 2 - ముంజ్యా గురించి అలాంటి చ‌ర్చ సాగింది.

కానీ మాలీవుడ్ లో సాయిప‌ల్ల‌వి, ఫ‌హ‌ద్ ఫాజిల్ న‌టించిన 2019 చిత్రం `అతిరన్` వీట‌న్నిటినీ కొట్టే సినిమా. వెన్ను జ‌ల‌ద‌రించే థ్రిల్స్ తో ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తుంది. ఈ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్‌లో న‌టీన‌టులు నువ్వా నేనా? అంటూ పోటీప‌డి న‌టించారు. సాయిప‌ల్ల‌వి, ఫ‌హ‌ద్, అతుల్ కులకర్ణి, రెంజి పనికర్, శాంతి కృష్ణ, సుదేవ్ నాయర్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ప్రకాష్ రాజ్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు. వివేక్ దర్శకత్వం వహించగా, రాజు మాథ్యూ నిర్మించారు. అతిరన్ 2014 హాలీవుడ్ చిత్రం స్టోన్‌హర్స్ట్ అసైలమ్ త‌ర‌హాలో ర‌క్తి క‌ట్టించింద‌ని ప్ర‌శంస‌లు కురిసాయి.

కేరళలోని ఏకాంత ఆసుపత్రిలో జ‌రిగిన టెరిఫిక్ స్టోరీ ఇది. నమ్మశక్యం కాని అరుదైన ల‌క్ష‌ణాలు ఉన్న‌ ఆటిస్టిక్ రోగి మార్మిక గతం ఏమిట‌నేది తెర‌పై చూసి తీరాలి. ఆమెను పరిశీలించే మానసిక వైద్యుడిగా ఫ‌హ‌ద్ న‌టించాడు. కథనం సాగే కొద్దీ ప్రేక్షకులు ఈ చిత్రంలోని ఊహించని మలుపులు, ట్విస్టుల‌ను కుర్చీ అంచుపైకి జారి వీక్షిస్తారు.థ్రిల్స్ పీక్స్ కి చేరతాయి. ఇది మానసిక ఆరోగ్యం గురించిన సినిమా. సంక్లిష్టమైన మ‌నిషి మనస్సు, అధికార పోరాటం వంటి అంశాల‌ను బ్లెండ్ చేసి అద్భుతంగా తెర‌కెక్కించారు.

సాయి పల్లవి సమస్యాత్మక రోగి పాత్రను పోషించగా, ఫహద్ ఫాసిల్ దృఢమైన న‌మ్మ‌కంతో చికిత్స‌ను కొన‌సాగించే మ‌నోరోగ వైద్యుడి పాత్రను పోషించారు. సహాయక తారాగణం కూడా సినిమా ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌డానికి స‌రిప‌డే న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. OTT ప్లాట్‌ఫామ్‌లలో ఈ చిత్రం గొప్ప ఆద‌ర‌ణ పొందింది. అతిరన్ హాట్‌స్టార్‌లో అత్యధికంగా వీక్షించిన చిత్రాలలో ఒకటి.

Tags:    

Similar News