ఆ టాప్ హీరోయిన్ రీ ఎంట్రీ ఉందా లేదా..?
ఇక పెళ్లి ఆ వెంటనే తల్లి అవ్వడంతో ఆసిన్ కంప్లీట్ ఫ్యామిలీ ఉమెన్ గా మారింది. అందుకే ఈ పదేళ్లలో కనీసం ఒక సినిమా వేడుకల్లో కూడా సరదాగా కూడా కనిపించలేదు ఆసిన్.;
సౌత్ స్టార్ హీరోయిన్ అసిన్ తెలుగులో కూడా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అటు సీనియర్ స్టార్స్ తో పాటు ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ తో కూడా అమ్మడు నటించింది. ఐతే సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆసిన్ అక్కడ మంచి క్రేజ్ సంపాదించింది. ఐతే పెళ్లి తర్వాత అమ్మడు పూర్తిగా సినిమాలకు దూరమైంది. ఈమధ్య పెళ్లి తర్వాత చాలా మంది కెరీర్ కు గ్యాప్ ఇచ్చి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి సర్ ప్రైజ్ చేస్తున్నారు. అఫ్కోర్స్ హీరోయిన్ పాత్రలే చేయకపోయినా సరే సపోర్టింగ్ రోల్స్ లో తమ సత్తా చాటుతున్నారు.
20 ఏళ్ల క్రితం యూఎస్ వెళ్లిన లయ మళ్లీ తమ్ముడు సినిమాతో మేకప్ వేసుకున్నారు. ఐతే అసిన్ కి మళ్లీ సినిమాల్లో నటించే ఆలోచన ఉందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ సడెన్ గా కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది అమ్మడు. 2015 లో అసిన్ చివరగా ఆల్ ఈజ్ వెల్ సినిమా చేసింది. ఆ తర్వాత ఏ సినిమా చేయలేదు. ఆ నెక్స్ట్ ఇయర్ అనగా 2016 లోనే రాహుల్ శర్మని పెళ్లాడింది ఆసిన్. 2017 లో వాళ్లకు ఒక పాప పుట్టింది.
ఇక పెళ్లి ఆ వెంటనే తల్లి అవ్వడంతో ఆసిన్ కంప్లీట్ ఫ్యామిలీ ఉమెన్ గా మారింది. అందుకే ఈ పదేళ్లలో కనీసం ఒక సినిమా వేడుకల్లో కూడా సరదాగా కూడా కనిపించలేదు ఆసిన్. ఐతే అసిన్ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది కానీ ఫుల్ స్టాప్ పెట్టినట్టు కాదని కొందరు అంటున్నారు. ఆడియన్స్ లో ఒక క్రేజ్ ఉన్న ప్రతి హీరోయిన్ తమ ఫ్యాన్స్ ని అలరించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. కానీ దానికి ఒక సరైన సమయం కావాల్సి ఉంటుందని చెబుతున్నారు.
ఆసిన్ కి కూడా ఏదైనా ఆఫర్ వస్తే ఈ పాత్ర తను చేస్తేనే బాగుంటుంది అని అనిపిస్తే చాలు తప్పకుండా మళ్లీ ఆన్ స్క్రీన్ మెరుస్తుంది. ఐతే రీ ఎంట్రీ తర్వాత మళ్లీ హీరోయిన్ గా చేయకపోయినా తనకు సూటయ్యే పాత్రలతో ఆసిన్ మెప్పిస్తుందని చెప్పొచ్చు. ఒకప్పటి హీరోయిన్స్ రీ ఎంట్రీ ట్రెండ్ నడుస్తున్న ఈ టైం లో ఆసిన్ కూడా మళ్లీ టాలీవుడ్ సినిమాలు చేస్తే మాత్రం అమ్మడి ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ అవుతారని చెప్పొచ్చు.