లవ్ మీ.. మళ్ళీ ఇదెక్కడి షాక్!

ఇక మేకర్స్.. నేడు ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Update: 2024-05-16 06:41 GMT

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ హీరోగా, 'బేబీ' ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా 'లవ్ మీ'. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. అయితే ఈపాటికే ఏప్రిల్ 25వ తేదీన 'లవ్ మీ' సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ ను వాయిదా వేశారు మేకర్స్.

రీసెంట్ గా మే 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. హారర్, కామెడీ థ్రిల్లర్ గా 'లవ్ మీ' చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీపై భారీగా అంచనాలు పెంచాయి. ఇటీవల మేకర్స్ విడుదల చేసిన 'స్టుపిడ్ హర్ట్' లిరికల్ సాంగ్ కూడా సినీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది.

ఇక మేకర్స్.. నేడు ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో సింగిల్ స్క్రీన్లన్నీ పది రోజుల పాటు మూతపడ్డాయి. మే 31వ తేదీన మళ్లీ ఓపెన్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో 'లవ్ మీ' రిలీజ్ మళ్లీ పోస్ట్ పోన్ అవ్వనున్నట్లు సమాచారం. ట్రైలర్ రిలీజ్ చేస్తూ కొత్త డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారని టాక్ నడుస్తోంది.

బాక్సాఫీస్ వద్ద పెద్దగా రిలీజులు లేకపోవడం వల్ల థియేటర్లను మూసివేశారు నిర్వాహకులు. అయితే వాటిని తెరిపించాలనుకుంటే దిల్ రాజుకు ఎంత టైమ్ కూడా పట్టదు. కానీ థియేటర్లు తెరిచాక ఆడియన్స్ రాకపోతే మొదటికి మోసం వస్తుంది. ఎన్నికలు ముగిసినా.. ఇంకా కుర్రాళ్లంతా ఐపీఎల్ మూడ్ లో ఉన్నారు. మే 26వ తేదీన లీగ్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీంతో మూవీని పోస్ట్ పోన్ చేయడమే బెటర్ అని మేకర్స్ అనుకుంటున్నారట.

ఓ యువకుడు దెయ్యాన్ని లవ్ చేస్తే ఎలా ఉంటుంది? అనేది 'లవ్ మీ' సినిమా కాన్సెప్ట్ గా తెలుస్తోంది. ఈ మూవీకి పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై హర్షిత్‌ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ కూడా బేబీ లా మంచి సక్సెస్ అందుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. మరి 'లవ్ మీ' సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News