హీరోయిన్లపై విమర్శలా? ఆషికా ఇచ్చిపడేసిందిగా!

సినిమాల్లో హీరోయిన్ల రోల్స్ ఇంపార్టెన్స్ పై మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా భారీ కమర్షియల్, పాన్ ఇండియా చిత్రాల్లో హీరోయిన్లకు సరైన స్పేస్ దక్కడం లేదనే విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి.

Update: 2026-06-06 18:34 GMT
సినిమాల్లో హీరోయిన్ల రోల్స్ ఇంపార్టెన్స్ పై మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా భారీ కమర్షియల్, పాన్ ఇండియా చిత్రాల్లో హీరోయిన్లకు సరైన స్పేస్ దక్కడం లేదనే విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. అయితే ఆ విషయంపై యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారాయి. స్టార్ హీరోల సినిమాల్లో నటించే హీరోయిన్లను విమర్శించడం సరికాదని ఆషికా అభిప్రాయపడ్డారు.



 


కథలో హీరోయిన్ రోల్ వీక్ గా ఉంటే దానికి యాక్ట్రెస్ లను బాధ్యులను చేయడం తప్పని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఉమెన్ రోల్స్ కు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత రైటర్స్, దర్శకులు, నిర్మాతలపై ఉంటుందని పేర్కొన్నారు. సాధారణంగా ఒక కమర్షియల్ సినిమా విడుదలైన తర్వాత హీరోయిన్ పాత్ర ఆశించిన స్థాయిలో లేకపోతే విమర్శలు నేరుగా ఆ నటిపైనే వస్తుంటాయి. అయితే స్క్రీన్ పై కనిపించే పాత్రను నిర్ణయించేది నటి కాదని, ఆ రోల్ ను ఎలా రాయాలో నిర్ణయించేది కథ, స్క్రీన్‌ ప్లే రూపొందించే వారేనని ఆషికా గుర్తు చేశారు.
పెద్ద హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ ను చాలామంది కేవలం పారితోషికం లేదా క్రేజ్ కోసమే తీసుకుంటారని కొందరు విమర్శిస్తుంటారని ఆమె అన్నారు. కానీ వాస్తవ పరిస్థితి అంత ఈజీ కాదని చెప్పిన ఆషికా.. ఒక స్టార్ హీరో సరసన నటించడం అనేది హీరోయిన్ల కెరీర్‌ కు కొత్త అవకాశాలు తెచ్చిపెడుతుందని, పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు పెరగడానికి యూజ్ అవుతుందని వివరించారు.
పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే సినిమాల ద్వారా కోట్లాది మంది ప్రేక్షకులకు చేరువయ్యే ఛాన్స్ లభిస్తుందని, అందుకే చాలామంది హీరోయిన్లు అలాంటి ప్రాజెక్టులకు ఓకే చెబుతున్నారని తెలిపారు. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన నిర్ణయం కాకుండా కెరీర్ లో భాగమనేది ఆమె అభిప్రాయం. ప్రస్తుతం కమర్షియల్ సినిమాల నిర్మాణం ఎక్కువగా హీరో చుట్టూ సాగుతోందని ఆషికా పేర్కొన్నారు.
బాక్సాఫీస్ అంచనాలు, అభిమానుల టేస్ట్, మార్కెట్ అవసరాల కారణంగా కథలు ఎక్కువగా హీరో చుట్టూనే తిరుగుతున్నాయని చెప్పారు. దీంతో హీరోయిన్ పాత్రలకు లిమిటెడ్ స్పేస్ మాత్రమే దక్కుతోందన్నారు. కొన్ని సందర్భాల్లో హీరోయిన్స్ రోల్స్ గ్లామర్ ప్రెజెన్స్‌ కే పరిమితమవుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. యాక్షన్ సన్నివేశాలు, హీరో ఎలివేషన్ ఎపిసోడ్లు ప్రధానంగా ఉండే సినిమాల్లో ఉమెన్ రోల్స్ కు తగినంత డెప్త్ ఇవ్వడం జరగడం లేదని అభిప్రాయపడ్డారు.
అయితే దీనికి సొల్యూషన్ హీరోయిన్లను విమర్శించడం కాదని, ఉమెన్ రోల్స్ ను మరింత స్ట్రాంగ్ గా తీర్చిదిద్దాలని మేకర్స్‌ ను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆషికా సూచించారు. హీరోయిన్ల పాత్రలు కథలో కీలకంగా ఉండేలా రాయడం ద్వారా మాత్రమే పరిస్థితుల్లో మార్పు వస్తుందని పేర్కొన్నారు. ఆషికా చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో మిక్స్ డ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. కొందరు ఆమె అభిప్రాయాన్ని సమర్థిస్తూ ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులను ఆమె బయటపెట్టారని అంటుంటే, మరికొందరు కమర్షియల్ సినిమాల కల్చర్ అలాంటిదేనని వాదిస్తున్నారు. ఏదేమైనా హీరోయిన్ల రోల్స్ ఇంపార్టెన్స్ పై ఆషికా కామెంట్స్ తో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Tags:    

Similar News