సరికొత్త మార్కెటింగ్ స్ట్రాటజీ..హిందీ మూవీలతో మింగిల్ !

అయితే ఇప్పుడు ఈ మార్కెటింగ్లో సరికొత్త స్ట్రాటజీ మొదలుపెట్టారని తెలుస్తోంది.. ఏంటా కొత్త స్ట్రాటజీ అంటే.. ఇప్పుడు ఏకంగా సెలబ్రిటీలతో కాదు సినిమాలలోనే వాటిని భాగం చేసి.. వాటికి ప్రమోషన్స్ చేస్తున్నారు నిర్వాహకులు.;

Update: 2025-09-24 19:30 GMT

సాధారణంగా ఒక వస్తువుని మనం మార్కెట్లోకి తీసుకెళ్లాలి అంటే.. దానికి ప్రమోషన్స్ అనేది చాలా ముఖ్యం. అందుకే ఎవరైనా సరే ఒక వస్తువుని మార్కెట్లోకి తీసుకొస్తున్నాము అంటే దానికి పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే అటు సోషల్ మీడియాను మొదలుకొని ఇటు సెలబ్రిటీలతో ఆయా వస్తువులను ప్రమోట్ చేసే స్థాయికి సంస్థలు చేరుకున్నాయనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ మార్కెటింగ్లో సరికొత్త స్ట్రాటజీ మొదలుపెట్టారని తెలుస్తోంది.. ఏంటా కొత్త స్ట్రాటజీ అంటే.. ఇప్పుడు ఏకంగా సెలబ్రిటీలతో కాదు సినిమాలలోనే వాటిని భాగం చేసి.. వాటికి ప్రమోషన్స్ చేస్తున్నారు నిర్వాహకులు. దీనివల్ల సినిమా నిర్మాతలకు లాభాలు రావడమే కాకుండా ఆయా ఉత్పత్తులకు ప్రమోషన్ కూడా లభిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.

అసలు విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తొలి దర్శకత్వంలో రాబోతున్న వెబ్ సిరీస్ 'ది బా**డ్స్ ఆఫ్ బాలీవుడ్'. ఇప్పటికే ముంబైలో ఈ సిరీస్ ప్రీమియర్స్ వెయ్యగా.. పలువురు బడా బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఆర్యన్ ఖాన్ పై ప్రశంసలు కురిపించారు. ఇకపోతే ఈ సీరీస్ కి అదనపు క్రేజ్ తీసుకురావడానికి అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ , రణబీర్ కపూర్ , షారుఖ్ ఖాన్ తో పాటు మరికొంతమంది సెలబ్రిటీలు ఇందులో అతిధి పాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా ఈ సెలబ్రిటీల అభిమానులలో కూడా వెబ్ సిరీస్ పై క్యూరియాసిటీ పెంచడానికి ప్రతి స్టార్ హీరోని కూడా ఈ వెబ్ సిరీస్ లో భాగం చేయడం గమనార్హం.

ఇకపోతే ఇక్కడ సెలబ్రిటీలనే కాదు పెద్ద పెద్ద బ్రాండ్లకి కూడా ప్లేస్మెంట్ కల్పించడం జరిగింది. ముఖ్యంగా పలు ఉత్పత్తుల నుండి బార్ ల వరకు దాదాపు ప్రతి సన్నివేశంలోనూ డి యావోల్ కనిపిస్తుంది.. ఇది రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ తో దాని సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. అలాగే మదర్ డైరీ కూడా ఈ వెబ్ సిరీస్ లో ప్రత్యేకంగా నిలుస్తోంది.. ఈ బ్రాండ్ తెరపై రోజు వారి క్షణాలతో అల్లుకొని పాత్రలు తమ సాధారణ జీవితంలో భాగంగా దానిని ఎలా ఉపయోగిస్తాయో చూపించడం జరిగింది.

ఈ సినిమాలోని పాత్రలు ప్రయాణించిన ప్రతిసారి గోఐబిబో కనిపిస్తుంది.విమానాశ్రయంలో అలాగే విమాన సన్నివేశాలలో కూడా దీనిని చూపించారు. వీటితోపాటు సెంకో , మోంటే కార్ల ప్రమోషన్ కూడా ఇందులో చేయబడింది. అలాగే ఫస్ట్ ఫిలిం అవార్డుల సందర్భంగా బి కే టి టైర్లు కూడా ఇందులో ప్రమోషన్ చేయబడ్డాయి. ఇలా ఊహించని బ్రాండ్లు కూడా బాలీవుడ్ గ్లామర్ తో ఎలా లింక్ అవుతాయో ఇక్కడ చూపించారు . మొత్తానికి అయితే అటు బాలీవుడ్ స్టార్స్ ఇటు బ్రాండ్ ప్రమోటర్స్ రెండు కూడా ఈ వెబ్ సిరీస్ లో భాగమయ్యాయి. ఏది ఏమైనా ఇలాంటి సరికొత్త స్ట్రాటజీ ఉపయోగించడం అటు నిర్మాతలకు ఇటు బ్రాండ్ ఉత్పత్తులకు భారీ ఆదాయం తెచ్చి పెట్టేలా కనిపిస్తోందని ప్రేక్షకులు కూడా కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News