'ఆర్య 3' విషయంలో దిల్ రాజు ట్విస్ట్!
దర్శకుడిగా సుకుమార్, నిర్మాతగా దిల్ రాజు విజయాల బాట పట్టారు. సక్సెస్ ఫుల్‌గా కెరీక్‌ని కొనసాగిస్తున్నారు.;

'ఆర్య' ప్రేమకథా చిత్రాల్లో ఇదొక ట్రెండ్ సెట్టర్. హీరోగా బన్నీకి తిరుగులేని గుర్తింపుని తెచ్చి పెట్టిన ఈ మూవీతోనే లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకుడిగా, దిల్ రాజు నిర్మాతగా కెరీర్ ప్రారంభించారు. ఈ ఇద్దరికీ కూడా 'ఆర్య' మంచి పాపులారిటీని తెచ్చి పెట్టింది. హీరోగా బన్నీతో పాటు దర్శకుడిగా సుకుమార్‌ని, నిర్మాతగా దిల్ రాజుని నిలబెట్టి ఇండస్ట్రీకి సక్సెస్ ఫుల్ టీమ్‌ని అందించింది. ఈ సినిమా తరువాత హీరోగా అల్లు అర్జున్ వెనుతిరిగి చూసుకోలేదు.
దర్శకుడిగా సుకుమార్, నిర్మాతగా దిల్ రాజు విజయాల బాట పట్టారు. సక్సెస్ ఫుల్‌గా కెరీక్‌ని కొనసాగిస్తున్నారు. అదే స్ఫూర్తితో కొంత కాలం తరువాత `ఆర్య2` చేశారు. కానీ అది పెద్దగా వర్కవుట్ కాలేదు. మళ్లీ ఇన్నేళ్ల విరామం తరువాత దిల్ రాజు `ఆర్య 3`కి శ్రీకారం చుట్టాలని ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ టైటిల్‌ని నిర్మాత దిల్ రాజు రిజిస్టర్ చేయించడంతో అందరిలో ఆసక్తి మొదలైంది. దీనికి సుకుమార్ ఖథ అందించబోతున్నారు. అయితే డైరెక్టర్ మాత్రం కొత్త వ్యక్తి ఉండబోతున్నాడని తెలిసింది.
అయితే ఇందులో దిల్‌రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ హీరోగా నటిస్తాడని, ఇది అతని కెరీర్ టర్నింగ్ సినిమా అవుతుందని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే దీనిపై తాజాగా నిర్మాత దిల్ రాజు ట్విస్ట్ ఇచ్చారు. ఆ వార్తల్లో నిజం లేదని, ఇందులో ఆశిష్ హీరో కాదని తేల్చేశారు. నేను సుకుమార్ కలిసి సరదాగా మాట్లాడుకుంటున్న సందర్భంలో ఓ ఐడియా తట్టింది. `ఆర్య 3`కి ఇది పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. అందుకే ఆ టైటిల్ రిజిస్టర్ చేశాం. అయితే దీనికి సుకుమార్‌లా సినిమా అంటే పిచ్చి ఉన్న దర్శకుడు కావాలి.
ఇందులో నటించే హీరో ఎవరన్నది ఇప్పుడే చెప్పలేం. అయితే ఆశిష్ కోసమే ఈ కథని సిద్ధం చేయడం లేదు. అది నిజం కాదు కూడా. కథ పూర్తిగా సెట్ అయ్యాక హీరో ఎవరనేది ఫైనల్ చేస్తాం. అప్పుడే హీరో దగ్గరికి వెళతాం. ప్రేమకథల్లో `ఆర్య` ఓ ట్రెండ్ సెట్టర్. అదే తరహాలో `ఆర్య 3` కూడా ట్రెండ్ సెట్ చేస్తుంది` అని దిల్ రాజు అసలు విషయం బయటపెట్టారు. ఆర్య 3కి సుకుమార్ లాంటి పిచ్చి ఉన్న దర్శకుడు కావాలంటే ఆయన దగ్గర వెతకాల్సిందే. ఆయన టీమ్‌లో చాలా మంది యంగ్ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ల నుంచే దిల్ రాజు ఓ దర్శకుడిని ఎంచుకుని అవకాశం ఇవ్వడంకాయం అని తెలుస్తోంది. మరి ఆ అదృష్టవంతుడు ఎవరో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.