• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'అంటే.. సుందరానికీ!'...

'అంటే.. సుందరానికీ!' జీరోత్ లుక్: ఫన్నీ గెటప్ లో ఆకట్టుకున్న నాని..!

By - Tupaki Desk
Update: 2022-01-01 13:30 GMT
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ రోమ్-కామ్ ఎంటర్టైనర్ ''అంటే.. సుందరానికీ!''. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. టైటిల్ అనౌన్సమెంట్ పోస్టర్ తోనే మేకర్స్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించారు. ఈ క్రమంలో న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన జీరోత్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఇందులో నాని ఎర్రటి చొక్కా - పంచె కట్టులో బ్లాక్ టాన్ షూ వేసుకొని విలక్షణమైన, ఫన్నీ లుక్ లో ఉన్నాడు. అలానే ఒక ట్రావెల్ లగేజీ బ్యాగ్ పై రిలాక్సింగ్ గా వాలిపోయి నవ్వుతూ కనిపిస్తున్నాడు. లగేజీ బ్యాగ్ పై హనుమాన్ విగ్రహాన్ని కూడా గమనించవచ్చు. న్యూ ఇయర్ సందర్భంగా మోషన్ పోస్టర్ ని కూడా ఆవిష్కరించారు.

అనౌన్స్మెంట్ పోస్టర్ లో చూసినట్లుగా, సినిమాలో నాని పేరు చాలా పొడవుగా ఉంది. 'K.P.V.S.S.P.R సుందర ప్రసాద్' అంటే ఏంటో తెలుసుకోడానికి దయచేసి దీన్ని జాగ్రత్తగా వినండి అనే డిస్క్లైమర్ తో ఈ వీడియో ప్రారంభమైంది. దూరదర్శన్ లో వార్తలు చదువుతున్న శైలిలో నాని ప్రవరాన్ని జపిస్తూ, తన గోత్రాన్ని మరియు పూర్తి పేరును వెల్లడించడం సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది.

“హరితస్య” అనేది తన గోత్రమని.. “కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్” అనేది తన పూర్తి పేరని నాని వెల్లడించారు. ఈ మోషన్ పోస్టర్ కి వివేక్ సాగర్ తన సంగీతంతో మరింత హాస్యాన్ని జోడించారు. టైటిల్ పోస్టర్ తో పాటుగా ఇప్పుడు వచ్చిన వీడియో 'అంటే సుందరానికీ' సినిమా ఫన్ రైడ్ గా ఉండబోతోందని హామీ ఇస్తున్నాయి.

'అంటే సుందరానికీ' చిత్రాన్ని 'ఆవకాయ' సీజన్ లో అంటే 2022 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఈ మోషన్ పోస్టర్ వీడియోలో ప్రకటించారు. ఈ సినిమాలో నాని సరసన నజ్రియా నజీమ్ ఫహద్ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ భామకు ఇది తెలుగు డెబ్యూ. నదియా - హర్షవర్ధన్ - రాహుల్ రామకృష్ణ - సుహాస్ తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ పై నవీన్‌ యెర్నేని - వై. రవిశంకర్‌ 'అంటే సుందరానికీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ర‌వితేజ గిరిజాల ఎడిట‌ర్‌ గా వర్క్ చేస్తున్నారు. లతా నాయుడు ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల 'శ్యామ్ సింగ రాయ్' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న నాని కి.. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.






Full View
Tags:    
  • Ante Sundaraniki 
  • nani28 
  • Zeroth Look of Sundar 
  • K P V S S P R Sundara Prasad 
  • nani New Movie 
  • Nazriya Fahadh 
  • Vivek Athreya 
  • Vivek Sagar 

Similar News

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

Copyright @2026

Powered by Blink CMS