'మిస్ ఇండియా'తో మిస్ అయిపోయారా...?
థియేటర్స్ క్లోజ్ అవడంతో కొత్త సినిమాలన్నీ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ వేదికగా విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో గత ఎనిమిది నెలల కాలంలో అనేక సినిమాలు డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజ్ అయ్యాయి. అయితే ఎక్కువ శాతం డిజిటల్ రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీ ఆడియన్స్ నుంచి విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమాల విషయంలో ఓటీటీల అంచనాలు తప్పాయని తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మిస్ ఇండియా' కూడా డైరెక్ట్ ఓటీటీలో విడుదల అయింది. నరేంద్రనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మించారు. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ఈరోజు నుంచి 'మిస్ ఇండియా' చిత్రాన్ని స్ట్రీమింగ్ కి పెట్టారు.
అయితే ఓటీటీ ప్రేక్షకుల నుంచి 'మిస్ ఇండియా' సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ వారు కీర్తి సురేష్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని దాదాపు 11 కోట్లకి కొనుగోలు చేసినట్లు ఓటీటీ వర్గాలు చెబుతున్నాయి. సినిమా బాగుంటే వారు పెట్టిన మొత్తాన్ని గెయిన్ చేసుకోవడం ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కి పెద్ద విషయమేమి కాదు. కాకపోతే నిన్న రాత్రి 'మిస్ ఇండియా' ప్రివ్యూ ప్రసారం అయినప్పటి నుంచే ఈ సినిమా చాలా డల్ గా ఉందని టాక్ వచ్చింది. ఈ క్రమంలో సినీ విశ్లేషకులు కూడా నెగెటివ్ ఫీడ్ బ్యాక్, నెగెటివ్ రివ్యూస్ ఇచ్చారు. ప్రొడ్యూసర్స్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా 4 కోట్లకి అమ్మినట్లుగా సమాచారం. మొత్తంగా చూసుకుంటే 'మిస్ ఇండియా' సినిమా నిర్మాతకి లాభమే తెచ్చిపెట్టింది. కాకపోతే 'మిస్ ఇండియా' సినిమాని కొనుకున్న ఓటీటీ వాళ్లే మిస్ అయిపోయారని.. ఈ సినిమాతో నెట్ ఫ్లిక్స్ కూడా మిగతా ఓటీటీల జాబితాలోకి చేరిపోయిందని కామెంట్స్ వస్తున్నాయి.