• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'మేజర్' సాంగ్ కోసం...

'మేజర్' సాంగ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ - యంగ్ సెన్సేషనల్ కసరత్తులు..!

By - Tupaki Desk
Update: 2022-01-13 07:30 GMT
యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకల బ్యాక్ టు బ్యాక్ చార్ట్ బస్టర్ మ్యూజికల్ ఆల్బమ్స్ అందిస్తూ.. వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ట్యూన్స్ కంపోజ్ చేస్తూ.. శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. మరోవైపు యంగ్ సెన్సేషనల్ సిద్ శ్రీరామ్ తన వాయిస్ తో మెస్మరైజ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సిద్ పాట లేని సినిమా లేదనడంలో అతిశయోక్తి లేదు. కేవలం సిద్ పాడిన సాంగ్ తోనే సినిమాకు హైప్ క్రియేట్ అవుతుంది.. జనాలను థియేటర్లకు రప్పిస్తోంది. ఇప్పుడు శ్రీచరణ్ పాకాల - సిద్ శ్రీరామ్ కలిసి ''మేజర్'' సినిమాలోని 'హృదయమా' అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ రూపొందించారు.

26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ''మేజర్''. యువ హీరో అడివి శేష్ టైటిల్ రోల్ పోషించిన ఈ మూవీలో సయీ మంజ్రేకర్ - శోభితా ధూళిపాళ - ప్రకాష్ రాజ్ - రేవతి - మురళీ శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. తెలుగు హిందీ మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.

''మేజర్'' చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ - టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో ఇటీవల రిలీజ్ చేయబడిన 'హృదయమా' అనే ఫస్ట్ సింగిల్ శ్రోతలను విశేషంగా అలరిస్తోంది. శ్రీచరణ్ పాకాల అద్భుతమైన స్వరాలకు సిద్ శ్రీరామ్ మధురమైన గాత్రం - గీత రచయిత కృష్ణకాంత్ సాహిత్యం తోడై ఈ సాంగ్ ను ఇంస్టెంట్ హిట్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పాట జామింగ్ సెషన్ కు సంబంధించిన ఓ వీడియోని మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇందులో సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ ఇంస్ట్రుమెంట్ ప్లే చేస్తుండగా.. సింగర్ సిద్ శ్రీరామ్ తనదైన శైలిలో లిరిక్ షీట్ చూస్తూ పాట పడుతూ కనిపించారు. ''నిన్నే కోరేనే.. నిన్నే కోరే.. ఆపేదెలా నీ చూపునే.. నేనేలేనే.. నువ్వై నేనే..'' అంటూ సాగిన ఈ గీతం ప్రేక్షకులను అలరిస్తోంది. సినిమాలో సందీప్ మరియు అతని ప్రేయసి మధ్య అందమైన ప్రేమకథను ఈ పాటలో చూడొచ్చు.

కాగా, ''మేజర్'' చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. అడవి శేష్ స్టోరీ - స్క్రీన్ ప్లే సమకూర్చగా.. అబ్బూరి రవి డైలాగ్స్ అందించారు. మహేష్ బాబు GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు A+S మూవీస్‌ సంస్థతో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. 2022 ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.






Tags:    
  • Adivi sesh 
  • Adivi sesh major 
  • Adivi sesh movies 
  • Major Release Date 
  • Major Shooting 

Similar News

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS