సడెన్ ట్విస్టు: డైరెక్టర్ అవుతున్న యంగ్ హీరో
ఇటీవలే యంగ్ హీరో నిఖిల్ ప్రేమించి పెద్దల ఆశీస్సులతో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ సమయాన్ని తన భార్యతో స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ముందే తన ఫ్యామిలీ లైఫ్ మధురిమల గురించి పుట్టబోయే కిడ్ గురించి కూడా నిఖిల్ ముచ్చటించడం అభిమానుల్లో వైరల్ అయ్యింది. ఇక తదుపరి వృత్తిగతంగా అతడు బిజీ అవుతున్నాడు. త్వరలో సెట్ లోకి అడుగు పెట్టాలనుకుంటున్నారు. గత ఆరు నెలలుగా షూటింగ్ లు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆన్ లాక్ ప్రక్రియ ప్రారంభం కావడంతో షూటింగ్ చేయడానికి ఒక్కో హీరో ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో నిఖిల్ కూడా షూటింగ్‌కి సిద్ధమవుతున్నారు.
నిఖిల్ నటిస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ `కార్తికేయ 2`. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఇది. ఈ నేపథ్యంలో నిఖిల్ కమెడియన్ అలీ టాక్ షోలో పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు. త్వరలో ఒక ప్రయోగాత్మక పిల్లల చిత్రంతో దర్శకుడిగా మారనున్నట్లు నిఖిల్ వెల్లడించాడు. ఇక ఇటీవల నిఖిల్ `కార్తికేయ 2` కాన్సెప్ట్ పోస్టర్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదొక సాహసోపేతమైన థ్రిల్లర్ గా తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్‌ని సామాజిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ నిబంధనలతో ప్రారంభించబోతున్నారట.
నిఖిల్ నటుడిగా ఎంట్రీ ఇవ్వడానికి ముందు `హైదరాబాద్ నవాబ్స్` చిత్రానికి లక్ష్మీ కాంత్ చెన్న వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఆ అనుభవంతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా ఎలాంటి సర్ ప్రైజ్ ని ప్లాన్ చేశాడో చూడాలి మరి.