కొత్త కథలు సిద్ధం చేసిన యంగ్ డైరెక్టర్!
టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. పటాస్ సినిమాతో జర్నీ స్టార్ట్ చేసి సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2, లతో పాటు రీసెంట్ గా సంక్రాంతి బరిలో 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అటు మాస్ ఇటు క్లాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా అనిల్ రావిపూడి సినిమాలు నచ్చుతున్నాయి. తన ప్రతి సినిమాలో కామెడీ ప్రధానంగా తెరకెక్కిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్న అనిల్. ఇటీవలే ఎఫ్3 సినిమా కథను తయారుచేయడంలో లీనమయ్యాడట. గతేడాది విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లను హీరోలుగా.. తమన్నా, మెహరీన్ లను హీరోయిన్లుగా పెట్టి రూపొందించిన చిత్రం 'ఎఫ్2'. ఈ సినిమాకు సీక్వెలే ఎఫ్3.
సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాను 6 నెలలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి ఆశ్చర్యపరిచాడు. ఒక కథను రాస్తూ ఉండగా మరో ఆలోచన వస్తే, వెంటనే మరో పేపర్ పై పెట్టేస్తూ ఒకే సమయంలో రెండు మూడు కథలను రెడీ చేయడం అనిల్ రావిపూడి ప్రత్యేకత. అలా ఆయన తయారు చేసిన ఎఫ్3 కథతో పాటు మరో కథలు 4 సిద్ధం చేశారట. ఒకదాని తరువాత ఒకటిగా ఆ సినిమాలను ఆయన సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇక డైలాగ్స్ ను వేగంగా రాయడంలోను అనిల్ రావిపూడి తన సత్తా చాటుకున్నాడు. ఇలా ఏ రకంగా చూసినా, చాలా తక్కువ సమయంలో ప్రేక్షకుల ముందుకు సినిమాలను తీసుకొచ్చే అతికొద్ది మంది దర్శకులలో అనిల్ రావిపూడి కూడా చేరతాడని సినీ వర్గాల టాక్.