• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  షారుఖ్ చేసిన గాయానికి...

షారుఖ్ చేసిన గాయానికి సల్మాన్ మందు

By - Tupaki Desk
Update: 2016-07-11 15:30 GMT
యశ్ రాజ్ ఫిలిమ్స్.. బాలీవుడ్లో నెంబర్ వన్ నిర్మాణ సంస్థ. ఆ సంస్థకున్నంత సక్సెస్ రేట్ ఇండియాలో ఇంకే ప్రొడక్షన్ కంపెనీకీ లేదు. యశ్ చోప్రా మొదలుపెట్టి విజయవంతంగా నడిపించిన ఈ సంస్థను ఆయన తనయుడు ఆదిత్య చోప్రా మరింత గొప్ప స్థాయికి తీసుకెళ్లాడు. కొన్నేళ్లుగా ఆ సంస్థ పట్టిందల్లా బంగారమే అవుతోంది. చిన్న సినిమాలతో పాటు బడా ప్రాజెక్టులు సైతం ఆ సంస్థకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఐతే ఈ ఏడాది వేసవిలో మాత్రం యశ్ రాజ్ ఫిలిమ్స్ కు గట్టి షాక్ తగిలింది. షారుఖ్ ఖాన్ లాంటి బడా స్టార్ తో ఆ సంస్థ తెరకెక్కించిన ‘ఫ్యాన్’ అంచనాలకు భిన్నంగా ఫ్లాప్ అయింది. దీనికిముందు షారుఖ్ ఫ్లాప్ సినిమా ‘దిల్ వాలే’ రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

కానీ ‘ఫ్యాన్’ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా రూ.80 కోట్లకు పరిమితమైంది. ఈ సినిమాకు జరిగిన బిజినెస్ ప్రకారం చూస్తే ఇది పెద్ద డిజాస్టర్ కిందే లెక్క. బయ్యర్లకు యశ్ రాజ్ ఫిలిమ్స్ డబ్బులు వెనక్కివ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. ఐతే ఆ సినిమాకు జరిగిన నష్టాన్ని ‘సుల్తాన్’ పూడ్చేయడమే కాదు.. భారీగా లాభాలు మిగులుస్తోంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ బేనర్లోనే ‘సుల్తాన్’ అతి పెద్ద హిట్ గా నిలవబోతోంది. రూ.70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.600 కోట్లకు పైనే వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి షారుఖ్ యశ్ రాజ్ ఫిల్మ్స్ బేనర్ కు చేసిన గాయానికి సల్మాన్ మందు వేశాడన్నమాట.
Tags:    
  • Yashraj Films 
  • Sultan Movie 

Similar News

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Bigg Boss Telugu 10: రోహిత్ రీ-ఎంట్రీపై పెరుగుతున్న ఊహాగానాలు!

2026-11-03 04:12 GMT

Copyright @2026

Powered by Blink CMS