ఐదు భారీ చిత్రాల రిలీజ్ తేదీలు ప్ర‌క‌టించిన య‌ష్ రాజ్ బ్యానర్

Update: 2021-02-18 16:30 GMT
క‌రోనా క‌ల్లోలంలోనూ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న ఏకైక నిర్మాణ సంస్థ‌గా య‌ష్ రాజ్ ఫిలింస్ పేరు మార్మోగింది. ఓవైపు ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌న్నీ కుదేల‌వుతున్నా ధీమాగా త‌దుప‌రి చిత్రాల కోసం ఈ సంస్థ ప‌నుల్ని ఆప‌కుండా కొన‌సాగించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

దేశంలో అగ్రశ్రేణి ప్రొడక్షన్ హౌస్ ల‌క్ష‌ణం ఎలా ఉంటుందో చూపించింది య‌ష్ రాజ్ బ్యాన‌ర్. లాక్ డౌన్ లో రెడీ అయిన స్క్రిప్టుల‌న్నిటినీ ఇక ప‌ట్టాలెక్కించేందుకు భారీ ప్ర‌ణాళిక‌ను య‌ష్ రాజ్ సంస్థ సిద్ధం చేసింది. ఇప్ప‌టికే సెట్స్ లో ఉన్న‌వాటిని అలాగే కొత్త వాటిని ప‌ట్టాలెక్కించేస్తోంది. ఒకదాని తరువాత ఒకటిగా వ‌రుస‌ సినిమాలు పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ రెడీ చేసి ప్ర‌క‌టించేసింది.

ప్ర‌స్తుతం థియేటర్లలో ఆక్యుపెన్సీకి పూర్తిగా అనుమతి ఉంది. ఆ క్ర‌మంలోనే య‌ష్ రాజ్ బ్యాన‌ర్ తమ ఐదు భారీ సినిమాల విడుదల తేదీలను ప్రకటించింది. ఐదు సినిమాల్లో దాదాపు 20మంది క్రేజీ స్టార్లు న‌టిస్తుండ‌డం ఆస‌క్తిక‌రం.

బంటీ ఔర్ బాబ్లి 2 - ఏప్రిల్ 23.. జయేశ్‌భాయ్ జోర్దార్  -ఆగస్టు 27.. పృథ్వీరాజ్ -నవంబర్ 5 .. శంషేరా -జూన్ 25 .. సందీప్ పిర్ పింకీ ఫరార్ -మార్చి 19 ..  రిలీజ్ తేదీల్ని లాక్ చేశారు. ఈ చిత్రాలన్నీ 2021 లోనే థియేట‌ర్ల‌లో రిలీజ‌వుతుండ‌‌డం ఆస‌క్తిక‌రం.

జయేశ్ భాయ్ జోర్దార్ లో రణ్‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడు కాగా.. పృథ్వీరాజ్ లో అక్షయ్ కుమార్ న‌టిస్తున్నారు. బంటీ ఔర్ బబ్లి 2 లో సైఫ్ అలీ ఖాన్ క‌థానాయ‌కుడు. షంషేరా లో రణబీర్ కపూర్ హీరో కాగా.. సందీప్ పిర్ ఫరార్  లో అర్జున్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
Tags:    

Similar News