బొంబాయిని ఏలాలని కలలు గనే గ్యాంగ్ స్టర్ కథతో!
గ్యాంగ్ స్టర్ వర్సెస్ సీరియస్ కాప్ డ్రామాలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు అవే కథాంశాలు బాలీవుడ్ లోనూ తెరకెక్కుతున్నాయి. ఈ కేటగిరీలోనే జాన్ అబ్రహాం- కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ముంబై సాగా తెరకెక్కింది. ఈ భారీ యాక్షన్ మూవీ త్వరలోనే రిలీజ్ కి వస్తోంది.
తాజాగా ముంబై సాగా నుంచి డంకా బాజా పాట రిలీజైంది. జాన్ అబ్రహం- కాజల్ అగర్వాల్ గణేశోత్సవ్ వేడుకలో పెర్ఫామ్ చేసే పాట ఇది. కాజల్ ఎంతో ట్రెడిషనల్ లుక్ తో కనిపిస్తుండగా జాన్ గ్యాంగ్ స్టర్ లుక్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఆద్యంతం గ్యాంగ్ స్టర్ వర్సెస్ కాప్ వార్ ఆద్యంతం రక్తి కట్టించనుందని ఈ సాంగ్ లోనే హింట్ ఇచ్చారు. జాన్ వర్సెస్ ఇమ్రాన్ హష్మి (పోలీస్) ఎపిసోడ్స్ ఆద్యంతం వేడెక్కిస్తున్నాయి.
ఈ చిత్రంలో బొంబాయిని పాలించాలని కోరుకునే గ్యాంగ్ స్టర్ పాత్రను జాన్ పోషించగా.. జాన్ ను చంపి రూ .10 కోట్ల ప్రైజ్ మనీని గెలుచుకోవాలనుకునే సీరియస్ పోలీసు పాత్రలో ఇమ్రాన్ హస్మి నటించారు. ముంబై సాగాను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి కొనుక్కుంది. అయితే తొలుత డీల్ ఓకే అయినా కానీ తరువాత నిర్మాతలు ఆలోచన మార్చుకుని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్- క్రిషన్ కుమార్- అనురాధ గుప్తా- సంగీత అహిర్ నిర్మించారు.
సంజయ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 19 న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో సునీల్ శెట్టి- జాకీ ష్రాఫ్- కాజల్ అగర్వాల్- ప్రతీక్ బబ్బర్- రోహిత్ రాయ్- అంజనా సుఖానీ = గుల్షన్ గ్రోవర్ ముఖ్య పాత్రల్లో నటించారు.Full View
తాజాగా ముంబై సాగా నుంచి డంకా బాజా పాట రిలీజైంది. జాన్ అబ్రహం- కాజల్ అగర్వాల్ గణేశోత్సవ్ వేడుకలో పెర్ఫామ్ చేసే పాట ఇది. కాజల్ ఎంతో ట్రెడిషనల్ లుక్ తో కనిపిస్తుండగా జాన్ గ్యాంగ్ స్టర్ లుక్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఆద్యంతం గ్యాంగ్ స్టర్ వర్సెస్ కాప్ వార్ ఆద్యంతం రక్తి కట్టించనుందని ఈ సాంగ్ లోనే హింట్ ఇచ్చారు. జాన్ వర్సెస్ ఇమ్రాన్ హష్మి (పోలీస్) ఎపిసోడ్స్ ఆద్యంతం వేడెక్కిస్తున్నాయి.
ఈ చిత్రంలో బొంబాయిని పాలించాలని కోరుకునే గ్యాంగ్ స్టర్ పాత్రను జాన్ పోషించగా.. జాన్ ను చంపి రూ .10 కోట్ల ప్రైజ్ మనీని గెలుచుకోవాలనుకునే సీరియస్ పోలీసు పాత్రలో ఇమ్రాన్ హస్మి నటించారు. ముంబై సాగాను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి కొనుక్కుంది. అయితే తొలుత డీల్ ఓకే అయినా కానీ తరువాత నిర్మాతలు ఆలోచన మార్చుకుని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్- క్రిషన్ కుమార్- అనురాధ గుప్తా- సంగీత అహిర్ నిర్మించారు.
సంజయ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 19 న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో సునీల్ శెట్టి- జాకీ ష్రాఫ్- కాజల్ అగర్వాల్- ప్రతీక్ బబ్బర్- రోహిత్ రాయ్- అంజనా సుఖానీ = గుల్షన్ గ్రోవర్ ముఖ్య పాత్రల్లో నటించారు.