మళ్లీ వార్తల్లోకి సందీప్ బాలీవుడ్ ప్రాజెక్ట్..!

Update: 2020-12-07 09:30 GMT
'అర్జున్ రెడ్డి' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వెంటనే బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసాడు. ఇక్కడ 'అర్జున్ రెడ్డి' సినిమాను షాహిద్ కపూర్ హీరోగా 'కబీర్ సింగ్' అనే టైటిల్‌ తో రీమేక్ చేసి అక్కడ కూడా సూపర్‌ హిట్ అందుకున్నాడు. దాంతో సందీప్‌ కు వెంటనే మరో బాలీవుడ్ ఛాన్స్ దక్కింది. టీ-సిరీస్‌ లాంటి అతిపెద్ద నిర్మాణ సంస్థ సందీప్‌ వంగా తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరో రణ్‌ బీర్ కపూర్‌ తో కలిసి ఓ సినిమా చేయనున్నాడని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అది కూడా ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అని టాక్ వచ్చింది. అయితే 'కబీర్ సింగ్' తర్వాత సందీప్ చేయబోయే సినిమాపై ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రమంలో మరో సందీప్ బాలీవుడ్ ప్రాజెక్ట్ పై బీ టౌన్ లో మాట్లాడుకుంటున్నారు.

సందీప్ వంగా ప్రస్తుతం రణబీర్ కపూర్ తో ఓ లవ్ స్టొరీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయని టాక్ నడుస్తోంది. నిజానికి బాలీవుడ్ ప్రాజెక్ట్ లేట్ అవుతుండటంతో సందీప్ టాలీవుడ్ హీరోలతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. దీని కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి హీరోలకు కథలు వినిపించాడని వార్తలు వచ్చాయి. అయితే ఏదీ సెట్ అయినట్లు కనిపించలేదు. ఈ క్రమంలో మళ్ళీ హిందీ ప్రాజెక్ట్ గురించి న్యూస్ వస్తోంది. ప్రస్తుతం రణబీర్ కపూర్ నటిస్తున్న 'బ్రహ్మాస్త్ర' 'షంషేర్' చిత్రాలు పూర్తైన తర్వాత వచ్చే ఏడాది సందీప్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్తాడట. మరి ఇది ముందుగా చెప్పినట్లు యాక్షన్ మూవీనా? లేదా లవ్ స్టోరీ నా అనేది తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News