మాజీ ప్రియురాలితో రకుల్ ప్రీత్‌సింగ్ భర్త...?
ఇంకా ఆ ఇంటర్వ్యూలో జాకీ భగ్నాని మాట్లాడుతూ.. ఇద్దరికి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవు, తాను రకుల్ ముందే మాజీ ప్రియురాలితో మాట్లాడుతాను.;
టాలీవుడ్‌తో పాటు, బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేడయం ద్వారా అన్ని భాషల్లోనూ గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఒకానొక సమయంలో మహేష్ బాబు సినిమాకే డేట్లు ఇవ్వలేక నో చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్ గత కొంత కాలంగా సినిమాలకు కాస్త దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆమె దూరంగా ఉండాలి అనుకోవడం లేదు, ఆఫర్లు లేకపోవడం వల్ల ఆమె దూరంగా ఉంది. తెలుగులో ఈమె వరుస సినిమాలు చేస్తూ హఠాత్తుగా ఆఫర్లు కోల్పోయింది. టాలీవుడ్ నుంచి ఆఫర్లు లేని సమయంలో అనూహ్యంగా బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లను ఈ అమ్మడు దక్కించుకుంది. తక్కువ సమయంలోనే ఈ అమ్మడికి మంచి అక్కడ మంచి అవకాశాలు దక్కాయి. కానీ అదృష్టం కలిసి రాలేదు. అక్కడ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. దాంతో అక్కడ నుంచి కూడా ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి.
రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ...
ఈ మధ్య కాలంలో ఈమె చేసిన ఏ ఒక్క సినిమా మినిమం హిట్ కాలేదు. అందుకే ఈమెను ఫిల్మ్ మేకర్స్ పట్టించుకోవడం లేదు. అయితే జనాలు మాత్రం ఈమెను ఇప్పటికీ అభిమానిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే అందమైన ఫోటోలు, వీడియోలు ఈమెను ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుపుతున్న విషయం తెల్సిందే. ఇక ఈమె ఫోటో షూట్స్, ఇంటర్వ్యూలు సైతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతూ ఉంటాయి. తాజాగా ఈమె భర్త జాకీ భగ్నానీతో కలిసి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ చర్చనీయాంశం అయింది. పెళ్లి తర్వాత తమ ప్రొఫెషనల్ లైఫ్ లో ఎలాంటి మార్పు రాలేదని, భార్య భర్తలుగా ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం, అదే సమయంలో ఎవరి కెరీర్‌లో వాళ్లం ముందుకు సాగుతున్నామని ఇద్దరు కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఇంటర్వ్యూలో రకుల్ గురించి జాకీ...
ఇంకా ఆ ఇంటర్వ్యూలో జాకీ భగ్నాని మాట్లాడుతూ.. ఇద్దరికి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవు, తాను రకుల్ ముందే మాజీ ప్రియురాలితో మాట్లాడుతాను. తాను స్పీకర్ పెట్టి మరీ రకుల్ ముందు ఆమెతో మాట్లాడుతూ ఉంటాను. రకుల్ పూర్తిగా అర్థం చేసుకుంటుంది. నా గురించి ఆమెకు ఎలాంటి అనుమానాలు ఉండవు. అందుకే నా యొక్క అన్ని రహస్యాలను ఆమె ముందు ఉంచాను. భార్య భర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు అని జాకీ భగ్నాని చెప్పుకొచ్చాడు. నా ప్రొఫెషనల్ లైఫ్ లో ఏం చేసినా కూడా రకుల్ ఎప్పుడూ ప్రశ్నించదు. నాకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు, అన్ని విధాలుగా ఆమె నుంచి నాకు సహకారం అందుతుందని జాకీ భగ్నాని చెప్పుకొచ్చాడు. ఇద్దరికి అన్ని విధాలుగా సెట్ కావడం వల్లే తమ వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగుతుందని జాకీ భగ్నాని పేర్కొన్నాడు.
పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో సినిమాలు...
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి తర్వాత కూడా ఎప్పటిలాగే బోల్డ్‌గా నటిస్తూ, అన్ని రకాల పాత్రలను చేస్తుందంటే అందుకు కారణం జాకీ భగ్నాని ఆమెకు ఇచ్చిన స్వేచ్ఛ అనడంలో సందేహం లేదు. జాకీ ఇచ్చిన ఫ్రీడం కారణంగా తాను ఇబ్బంది లేకుండా మునుపటి మాదిరిగానే సినిమాల్లో నటిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తన సినిమాల ఎంపిక విషయంలో జాకీ ఎలాంటి నిర్ణయాలను చెప్పడని, పూర్తిగా నా ఇష్టానుసారంగా సినిమాలను చేస్తున్నట్లుగా చెప్పింది. ప్రస్తుతం నటిగా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కచ్చితంగా రాబోయే రోజుల్లో రీ ఎంట్రీ బలంగా ఇచ్చి, వరుస సినిమాలు చేస్తాను అనే నమ్మకంతో రకుల్ ప్రీత్ సింగ్ ఉంది. మరో వైపు జాకీ భగ్నానీ మాత్రం తన ఫ్యామిలీ బ్యానర్ అయిన పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ ను తిరిగి లాభాల్లోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతానికి ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నా, భవిష్యత్తు పై చాలా భరోసాగా ఉన్నారు.