టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంతకుముందు పరిస్థితి ఇప్పుడు లేదు. ఇంతకుముందు నమ్మకాలు కూడా ఇప్పుడు కనిపించడం లేదు. ఎందుకంటే ఒకప్పుడు సినిమా ఎన్ని రోజులపాటు థియేటర్లో ఆడిందని మాట్లాడేవారు. కానీ ఇప్పుడు విడుదలైన వెంటనే ఎంత ఎక్కువ వసూల్ చేసిందనేది వాడుక అయిపోయింది. సినిమాలు అలా రిలీజ్ అవుతున్నాయో లేదో వాటిలో కంటెంట్ ఎలా ఉందో కూడా తెలియకుండా సినిమాలను హిట్టు ప్లాప్ అని ఓ నిర్ణయానికి వస్తున్నారు. అందుకే ఇప్పుడు విడుదలైన సినిమా వసూళ్లపరంగా మినిమం టార్గెట్ రీచ్ అయితే సినిమా హిట్. ఇలాంటి ధోరణిలో సినిమాలన్ని విడుదలకు సిద్ధం అవుతున్నాయి. నిజానికి ఫిబ్రవరి మార్చ్ నెలలను సీసన్ లా భావించరు ఇండస్ట్రీ జనాలు. కానీ కరోనా తర్వాత సీసన్ - అన్ సీసన్ అనే మాటలు మూలనపడ్డాయి.
మార్చ్ 11న మహాశివరాత్రి సందర్బంగా తెలుగులో చాలా సినిమాలే విడుదల అవుతున్నాయి. అందులో మెయిన్ గా గాలిసంపత్, శ్రీకారం, జాతిరత్నాలు సినిమాల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూడింట్లో కాస్త పెద్దసినిమా అంటే శ్రీకారం అనే చెప్పాలి. ఆ తర్వాత మీడియం సినిమా గాలిసంపత్.. చివరిగా చిన్నసినిమా జాతిరత్నాలు. చూస్తుంటే మూడు కూడా దేనికవే పోటీలా కనిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతం జనాల నోళ్లలో బాగా నానుతున్న సినిమా అయితే జాతిరత్నాలు. ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా కోరుకుంటున్నారు. సినిమా బ్యాక్ డ్రాప్ ఏదైనా కామెడీ పక్కా కావాలని ప్రేక్షకులు ఎక్సపెక్ట్ చేస్తున్నారు. అయితే జాతిరత్నాలు మూవీ పూర్తి కామెడీ ఎంటర్టైనర్ అని టీజర్ చూస్తేనే అర్ధమవుతుంది. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్యపాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా పై జనాలలో రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. అలాగే సాంగ్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి. చూడాలి మరి జాతిరత్నాలు ఎలాంటి ఫలితం దక్కించుకుంటుందో!